కరోనా బేఖాతర్ : 300మందితో పెళ్లి విందు.. వధూవరుల తండ్రులపై కేసు.. !

By AN TeluguFirst Published Apr 30, 2021, 4:57 PM IST
Highlights

కరోనా నిబంధనల్ని పట్టించుకోకుండా వివాహానికి 300 మందిని ఆహ్వానించి, వివాహ విందును ఏర్పాటు చేసిన సంఘటన ఇది. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెంటూరులో ఏర్పాటైన ఈ వేడుకకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. 

కరోనా నిబంధనల్ని పట్టించుకోకుండా వివాహానికి 300 మందిని ఆహ్వానించి, వివాహ విందును ఏర్పాటు చేసిన సంఘటన ఇది. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెంటూరులో ఏర్పాటైన ఈ వేడుకకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. 

కరోనా విజృంభిస్తున్న తరుణంలో 50 మందికి మించకుండా వేడుకల్ని నిర్వహించుకోవాలని నిబంధనలు విధించారు. వీటిని పట్టించుకోకుండా పెళ్లి వేడుకకు 300మంది హాజరయ్యారు.

విషయం వాట్సప్ ద్వారా జిల్లా ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లింది. దీనిమీద నివేదిక పంపాలని రామచంద్రపురం ఆర్డీవో గాంధీని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అధికారులు విచారణ జరిపారు. 

విందు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీఆర్వో శాంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడి తండ్రి సురేష్ బాబు, వధువు తండ్రి వెంకటేశ్వరరావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona
 

click me!