పీవీ, మన్మోహన్ విధానాలే బెటర్: నిర్మలా సీతారామన్ పై భర్త పరకాల తిరుగుబాటు

By Nagaraju penumalaFirst Published Oct 14, 2019, 2:58 PM IST
Highlights

ఆర్థిక సంస్కరణల్లో దివంగత ప్రధానులు పీవీ నర్సింహరావు, మన్మోహన్‌ సింగ్ విధానాలే బాగా ఉండేవని కొనియాడారు. పరోక్షంగా భార్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై విమర్శలు గుప్పించారు.  
 

హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పై ఆమె భర్త పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలను కేంద్రం అంగీకరించడం లేదంటూ పరకాల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.  

ఆర్థిక సంస్కరణల్లో దివంగత ప్రధానులు పీవీ నర్సింహరావు, మన్మోహన్‌ సింగ్ విధానాలే బాగా ఉండేవని కొనియాడారు. పరోక్షంగా భార్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై విమర్శలు గుప్పించారు.  

మందగమనంలో ఉన్న వృద్ధిని పరుగులు పెట్టించేందుకు గాను కార్పొరేట్‌ పన్ను తగ్గిస్తూ ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్న నిర్ణయంపై సెటైర్లు వేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. దాంతో అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి రేటును తగ్గించేస్తున్న సంగతి తెలిసిందే. 
 
ప్రపంచ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాని ఏకంగా ఒకటిన్నర శాతం కుదించిన విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో భారత జీడీపీ వృద్ధి రేటు 2019-20లో 7.5 శాతం ఉంటుందన్న ప్రపంచ బ్యాంకు, ఇపుడు దాన్ని 6 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. 

గత ఆర్థిక సంవత్సరం నమోదైన 6.8 శాతంతో పోల్చినా ఇది 0.8 శాతం తక్కువ. వృద్ధి రేటు మరింత నీరసించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించిందన్నారు. అదే జరిగితే ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థకు మరిన్ని కష్టాలు తప్పవన్నారు పరకాల ప్రభాకర్. 

click me!