పాణ్యం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 20, 2024, 9:36 PM IST
Highlights

ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు పాణ్యం కేంద్రంగా వుండేది. బిజ్జం , గౌరు, కాటసాని కుటంబాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. 1967లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ రెండు సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు విజయం సాధించారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి కాంగ్రెస్, వైసీపీల తరపున 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. పాణ్యంలో తన పట్టు సడలకూడదని వైఎస్ జగన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా మరోసారి కాటసాని రాంభూపాల్ రెడ్డికి టికెట్ కేటాయించారు. చివరిసారిగా 1999లో బిజ్జం పార్థసారథి రెడ్డి తెలుగుదేశం పార్టీ టికెట్‌పై విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్‌లు తమ వ్యూహాలతో సైకిల్‌కు ఛాన్స్ ఇవ్వలేదు. 

పాణ్యం .. ఉమ్మడి కర్నూలు జిల్లాగా వున్నప్పుడు ఓటర్ల పరంగా అతిపెద్ద నియోజకవర్గం. ఇప్పుడు రెండు జిల్లాల పరిధిలోకి విస్తరించింది. కల్లూరు అర్బన్, కల్లూరు గ్రామీణ, ఓర్వకల్లు మండలాలు కర్నూలు జిల్లాలో.. పాణ్యం, గడివేముల మండాలలు నంద్యాల జిల్లాలో వున్నాయి. ఎన్నికల నిర్వహణకు వచ్చేసరికి పాణ్యం కర్నూలు జిల్లా పరిధిలోనే వుంచారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు పాణ్యం కేంద్రంగా వుండేది. బిజ్జం , గౌరు, కాటసాని కుటంబాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే పరిస్ధితుల్లో మార్పు వస్తోంది. 

పాణ్యం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు అడ్డా :

పాణ్యంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,88,031 . 1967లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ రెండు సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు విజయం సాధించారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి కాంగ్రెస్, వైసీపీల తరపున 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. ఈ వయసులోనూ తన ఎత్తుగడలతో రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా బరిలో దిగిన రాంభూపాల్ రెడ్డికి 1,22,476 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి గౌరు చరితా రెడ్డికి 78,619 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 43,857 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. 

పాణ్యం శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. పాతికేళ్లుగా గెలవని టీడీపీ :

పాణ్యంలో తన పట్టు సడలకూడదని వైఎస్ జగన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా మరోసారి కాటసాని రాంభూపాల్ రెడ్డికి టికెట్ కేటాయించారు. టీడీపీ విషయానికి వస్తే.. ఇక్కడ ఆ పార్టీ గెలిచి దాదాపు పాతికేళ్లు కావొస్తోంది. చివరిసారిగా 1999లో బిజ్జం పార్థసారథి రెడ్డి తెలుగుదేశం పార్టీ టికెట్‌పై విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్‌లు తమ వ్యూహాలతో సైకిల్‌కు ఛాన్స్ ఇవ్వలేదు. ఈసారి మాత్రం పాణ్యంలో పసుపు జెండా ఎగురవేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. గౌరు చరితా రెడ్డికి టీడీపీ టికెట్ కేటాయించింది. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో వచ్చిన సానుభూతితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కారణంగా తాను విజయం సాధిస్తానని చరితా రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 

click me!