శ్రీకాకుళం జిల్లాలో ఆసక్తికర రాజకీయాలు సాగే నియోజకవర్గాల్లో పలాస ఒకటి. ఇక్కడినుండి ప్రస్తుతం మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా మళ్ళీ ఆయననే వైసిపి పోటీలో నిలపగా టీడీపీ గౌతు శిరీషను బరిలోకి దింపింది. ఇద్దరు బలమైన నేతల పోటీతో పలాస పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి.
పలాస నియోజకవర్గ రాజకీయాలు :
2008 లో చేపట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకణలో భాగంగా పలాస అసెంబ్లీ ఏర్పడింది. పలాసలో ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరగ్గా ఒక్కోసారి ఒక్కోపార్టీ గెలిచింది. 2009 లో జట్టు జగన్నాయకులు (కాంగ్రెస్), 2014లో గైతు శ్యాంసుందర్ శివాజీ (టిడిపి), 2019 లో సీదిరి అప్పలరాజు(వైసిపి) గెలిచారు. ప్రస్తుత పలాస ఎమ్మెల్యే అప్పలరాజు వైఎస్ జగన్ కేబినెట్ లో మంత్రిగా వున్నారు.
స్వాతంత్య్ర సమరయోధులు గౌతు లచ్చన్న కుటుంబానికి పలాస రాజకీయాలతో సంబంధాలున్నాయి. ఆయన కుమారుడు గౌతు శ్యాంసుందర్ ఇప్పటికే పలాస ఎమ్మెల్యేగా పనిచేయగా ఇప్పుడు ఆయన కూతురు పోటీ చేస్తున్నారు.
undefined
పలాస నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. పలాస
2. మందస
3. వజ్రపు కొత్తూరు
పలాస అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,06,799
పురుషులు - 1,03,491
మహిళలు - 1,03,259
పలాస అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
మంత్రి సీదిరి అప్పలరాజు మరోసారి పలాసలో పోటీ చేస్తున్నారు.
టిడిపి అభ్యర్థి :
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర్ శివాజీ రాజకీయ వారసురాలిగా రాజకీయం రంగప్రవేశం చేసిన గౌతు శిరీష మళ్ళీ పలాసలో పోటీ చేస్తున్నారు. 2019లో అప్పలరాజు చేతిలో ఓడినప్పటికీ శిరీషకే మరో అవకాశం ఇచ్చింది టిడిపి.
పలాస అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
పలాస అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజుపై టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సీదిరి అప్పలరాజు 61,210(36.43%) ఓట్లు సాధించగా, టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష 1,01,560 (60.44%) ఓట్లను సాధించింది.
పలాస అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,47,647 (72 శాతం)
వైసిపి - సీదిరి అప్పలరాజు - 76,603 ఓట్లు (51 శాతం) - 16,247 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - గౌతు శిరీష - 60,356 ఓట్లు (40 శాతం) - ఓటమి
పలాస అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,36,566 ఓట్లు (71 శాతం)
టిడిపి - గౌతు శ్యాంసుందర్ శివాజీ - 69,658 (51 శాతం) - 17,525 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - బాబూరావు వజ్జా - 52,133 (38 శాతం) - ఓటమి