పి.గన్నవరం బరిలోంచి తప్పుకున్న మహాసేన రాజేశ్.. కుల రక్కసికి బలైపోయానంటూ ఆవేదన

By Siva Kodati  |  First Published Mar 2, 2024, 4:10 PM IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పి.గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్ధిగా ఖరారైన మహాసేన రాజేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఎన్నికల బరిలోంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.


వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పి.గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్ధిగా ఖరారైన మహాసేన రాజేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఎన్నికల బరిలోంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కులరక్కసి చేతిలో మరొక్కసారి బలైపోయాను.. జగన్ రెడ్డి.. గుర్తుపెట్టుకుంటాను.. నా కోసం నా పార్టీని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ను ఎవ్వరూ తిట్టొద్దు.. నేను స్వచ్ఛందంగా తప్పుకుంటాను’’ అని రాజేశ్ పేర్కొన్నారు.

పొటీ చేయనివ్వకుండా సెంటిమెంట్ బ్లాక్‌మెయిల్ పార్టీ మీదకి తీసుకొస్తున్నారని రాజేశ్ ఆరోపించారు. మా వర్గాలు బాగుపడాలని, ప్రశ్నించేవారు వుండొద్దని వైసీపీ ఉద్దేశమని.. ప్రశ్నించే వారికి చంద్రబాబు టికెట్ ఇస్తే, పోటీ చేయనీయకుండా వ్యవస్ధతో అడ్డుకుంటున్నారని రాజేశ్ మండిపడ్డారు. తనను హిందూ ద్వేషిగా చిత్రీకరిస్తున్నారని.. తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావొద్దని పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మహాసేన రాజేశ్ పేర్కొన్నారు. 

Latest Videos

కాగా.. సరిపెల్ల రాజేశ్ అలియాస్ మహాసేన పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. కులానికి వ్యతిరేకంగా, దళితులపై జరుగుతున్న దాడులు ఇతర అంశాలపై పోరాటం చేశారు. తొలుత వైసీపీలో చేరిన రాజేశ్.. తదనంతరం జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేసేవారు. తర్వాత టీడీపీలో చేరిన రాజేశ్.. ఆ పార్టీ కోసం కష్టపడ్డారు. ఈ క్రమంలోనే పి.గన్నవరం టికెట్‌ను రాజేశ్‌కు కేటాయించారు చంద్రబాబు. అయితే గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై రాజేశ్ చేసిన వ్యాఖ్యలు కొద్దిరోజులుగా వైరల్ కావడంతో టీడీపీ , జనసేన కార్యకర్తలు భగ్గుమంటున్నారు. దీనికి తోడు హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు కూడా రాజేశ్‌కు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. 


 

click me!