నర్సాపురంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తన చెప్పుతో తానే కొట్టుకొని నిరసన వ్యక్తం చేశాడు.
నర్సాపురం: కొత్త జిల్లాల ఏర్పాటు అంశం వైసీపీ నేతల మధ్య విబేధాలను కూడా బయటపెడుతుంది. పశ్చిమగోదావరి నర్సాపురంలో మాజీ మంత్రి Kothapalli Subbarayudu, నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు మధ్య కొంత కాలంగా అగాధం ఉంది. Narsapur జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం ఆశ్వర్యంలో సాగిన దీక్షలో ఈ విషయం వెలుగుచూసింది.
నర్సాపురంలో All Party ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తన చెప్పుతో తానే కొట్టుకొన్నాడు. నర్సాపురంలో ఎమ్మెల్యేగా ముదునూరి ప్రసాద్ రాజును గెలిపించినందుకు గాను చెప్పుతో కొట్టుకొన్నాడు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు. అసమర్ధుడిని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్ పార్టీ నిరసన దీక్షలో చెప్పుతో కొట్టుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై పలు జిల్లాల్లో ఆందోళనలు సాగుతున్నాయి. జిల్లా కేంద్రాల ఏర్పాటు, పేర్లతో పాటు ఇతరత్రా డిమాండ్ల విషయమై ఆందోళనలు సాగుతున్నాయి.ఈ తరుణంలో నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి.ఇవాళ కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది.ఈ ఆందోళనలో పాల్గొన్న కొత్తపల్లి సుబ్బారాయుడు నిరసనలోప్రసాద్ రాజుపై తన వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తం చేశారు.
కొత్త జిల్లాలపై వచ్చే అన్ని రకాల అభ్యంతరాలు, సూచనలను క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసింది. ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్‌ఏ కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈ కమిటీని ఏర్పాటుచేశారు. కొత్త జిల్లాలకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలను జిల్లా కలెక్టర్లకు ఇచ్చేందుకు సర్కారు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు వీటిని స్వీకరిస్తున్నారు. తాము అందుకున్న విజ్ఞప్తులను కలెక్టర్లు www. drp.ap.gov.in వెబ్ సైట్‌లో ప్రతీరోజూ అప్‌లోడ్ చేయాల్సి వుంటుంది. ఇలా అప్‌లోడ్ చేసే ప్రతి అభ్యంతరం, సూచనను పరిశీలించి దానిపై రిమార్కు రాయాలి.
ఆ తర్వాత వాటిని కలెక్టర్లు, రాష్ట్రస్థాయి అధికారుల కమిటీ పరిశీలిస్తుంది. వచ్చిన అభ్యంతరాలు, సలహాలను ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేసి అది సహేతుకమైనదా? పరిగణలోకి తీసుకోవాలా లేదా? అని నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి అభ్యంతరం, పరిశీలనను స్వీకరించాలా? తిరస్కరించాలో? చెబుతూ ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. ఈ సిఫార్సుల ఆధారంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సి వుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.
ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు,సూచనలపై నివేదికను తయారు చేసి సీఎంకు ేపీ ప్రణాళిక కార్యదర్శి విజయ్ కుమార్ బృందం సీెం జగన్ కు నివేదిక అందిస్తారు.ఈ విషయమై సీఎం జగన్ నిర్ణయం తీసకొంటారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 7500 అభ్యంతరాలు వచ్చినట్టుగా విజయ్కుమార్ ప్రకటించారు. అత్యధికంగా విజయనగరం జిల్లా నుండే వచ్చాయని ఆయన తెలిపారు.