ఆపరేషన్ రాయల్ వశిష్టలో పురోగతి: బోటు పైభాగం వెలికితీత

By Nagaraju penumalaFirst Published Oct 21, 2019, 3:38 PM IST
Highlights

అనంతరం ఇనుప రోప్ లతో బోటును తీసేందుకు ప్రయత్నించారు. అయితే బోటు బరువుగా ఉండటంతో బోటు పైభాగం మాత్రమై పైకి వచ్చింది. దాంతో మరోసారి ఆపరేషన్ వశిష్ట ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. అయితే బోటు పై భాగాన్ని వెలుపలికి తీయడంతో కాస్త పురోగతి సాధించినట్లేనని తెలుస్తోంది. 

కచ్చులూరు: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో నీటమునిగిన రాయల్ వశిష్ఠబోటును వెలికితీసేందుకు చేపట్టిన ఆపరేషన్ వశిష్ఠలో పురోగతి సాధించింది ధర్మాడి సత్యం బృందం. గత ఏడు రోజులుగా నీటమునిగిన బోటును వెలికి తీసేందుకు ధర్మాడి సత్యం బృందం ప్రయత్నిస్తోంది. 

సోమవారం ఉదయం కూడా ధర్మాడి సత్యం బృందం బోటు వెలికి తీసేందుకు ప్రయత్నించారు. రెండు రోప్ ల సాయంతో మునిగిపోయిన బోటును వెలుపలికి తీసేందుకు ప్రయత్నించారు. 

అయితే బోటు బరువు తట్టుకోలేకపోవడంతో బోటు పైభాగం మాత్రమే పైకి వచ్చింది. మిగిలిన భాగం నదిలోనే మిగిలిపోయింది. ఇప్పటి వరకు గోదావరి నది ఉధృతంగా ప్రవహించడం, సుడిగుండాలు ఎక్కువగా ఉండటంతో బోటు తీయడం కష్టంగా మారింది. రెండు రోజులుగా గోదావరి ఉధృతి తగ్గడంతో బోటును వెలికితీసే పనులను వేగవంతం చేసింది ధర్మాడి సత్యం బృందం. 

కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ పర్యవేక్షణలో జరుగుతున్న బోటు వెలికితీత పనులు చేపట్టింది ధర్మాడి సత్యం. విశాఖపట్నం నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్ కు చెందిన 10 మంది డ్రైవర్లలో నాగరాజు, స్వామి అనే ఇద్దరు ఆదివారం ఉదయం 11 గంటలకు బోటు మునిగిన ప్రసదేశంలో నీటి అడుగు భాగంలోకి వెళ్లారు.

సుమారు 15నిమిషాలపాటు ఆ ప్రాంతంలో బోటు ఎలా మునిగిపోయింది అనే దానిపై వారు పరిశీలించారు. ఆరుసార్లు డ్రైవర్లు బోటు నీట మునిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. గోదావరిలో బోటు ఏటవాలుగా మునిగి ఉందని తెలిపారు. నదిలో బోటు ముందుభాగం 40 అడుగుల లోతులో ఉంటే వెనుక భాగం దాదాపు 70 అడుగుల లోతులో ఉందని డ్రైవర్లు స్పష్టం చేశారు. 

అనంతరం ఇనుప రోప్ లతో బోటును తీసేందుకు ప్రయత్నించారు. అయితే బోటు బరువుగా ఉండటంతో బోటు పైభాగం మాత్రమై పైకి వచ్చింది. దాంతో మరోసారి ఆపరేషన్ వశిష్ట ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. అయితే బోటు పై భాగాన్ని వెలుపలికి తీయడంతో కాస్త పురోగతి సాధించినట్లేనని తెలుస్తోంది. 

click me!