బీజేపీలో చేరిన మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి: జగన్ మెుండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Oct 21, 2019, 12:55 PM IST
Highlights

రివర్స్ టెండరింగ్‌ను అందరూ వ్యతిరేకించినా జగన్ మొండిగా ముందుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. 

ఢిల్లీ: మాజీమంత్రి, టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి సీఎం జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓటమిపాలయ్యారు. 

ఎన్నికల అనంతరం రాజకీయ భవిష్యత్ దృష్ట్యా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తాను బీజేపీలో చేరాలనుకుంటున్నట్లు ప్రకటించారు కూడా. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన అనంతరం సోమవారం కాషాయి కండువా కప్పుకున్నారు.  

న్యూఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆదినారాయణ రెడ్డికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన అనంతరం ఆదినారాయణ రెడ్డి జగన్ పై ఎటాక్ స్టార్ట్ చేశారు. 

దేశాభివృద్ధి ప్రాంతీయ పార్టీలతో సాధ్యం కాదన్న ఆయన సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పేదొకటి చేసేదొకటి అంటూ విమర్శలు చేశారు. అమరావతి రాజధానిగా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని వ్యాఖ్యానించారు. 

click me!