Operation Royal vashista: ఎవరీ ధర్మాడి సత్యం?

By telugu teamFirst Published Oct 23, 2019, 7:57 AM IST
Highlights

ఎన్డీఆర్ఎఫ్ వంటి సంస్థలు చేతులెత్తేసిన స్థితిలో గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం వెలికి తీసింది. అంత కష్టతరమైన పనిని సాధించిన ధర్మాడి సత్యం ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

రాజమండ్రి: గోదావరి నదిలో మునిగిన బోటును వెలికి తీయడం ద్వారాధర్మాడి సత్యం పేరు ఇప్పుడు మారుమోగుతోంది. తీవ్రమైన విషాదానికి కారణమైన బోటు ప్రమాదం మాట ఎలా ఉన్నా గోదావరిలో మునిగిన పడవను తీయడం అసాధ్యమనే మాట వినిపించింది. ఈ స్థితిలో ధర్మాడి సత్యం రంగంలోకి దిగారు. ఎట్టకేలకు గోదావరి నదిలో మునిగిన పడవ బయటకు వచ్చింది.

ధర్మాడి సత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు. మత్స్యకార కుటుంబంలో ఆయన పుట్టి పెరిగారు. పెద్దగా చదువుకోలేదు.. కానీ నదుల్లో, సముద్రంలో మునిగిన పడవలను వెలికి తీయడంలో అందె వేసిన చేయిగా పేరు గాంచారు. ప్రస్తుతం ధర్మాడి సత్యం బాలాజీ మెరైన్ సంస్థకు యజమాని.

తొలిసారి ధర్మాడి సత్యం యానాంలో నీట మునిగిని లాంచీని బయటకు లాగారు. అటు తర్వాత నాగార్జునసాగర్ లో మునిగిని బోటును ఇంజన్ చైన్ ద్వారా బయటకు తీశారు. ఇంకా మంటూరు వద్ద గోదావరిలో మునిగిని బోటును వెలికి తీశారు. గత నెలలో కచ్చలూరు వద్ద పర్యాటక పడవ గోదావరిలో మునిగిన రెండో రోజునే తాను దాన్ని బయటకు తీస్తానంటూ ముందుకు వచ్చారు. 

రాయల్ వశిష్ట బోటును వెలికి తీయడానికి నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా ప్రయత్నించాయి. ఉత్తరాఖండ్ కు చెందిన విపత్తు నిర్వహణ బృందం కూడా ఆ పనిచేయలేకపోయిం్ది. ఎన్టీఆర్ఎఫ్ ప్రత్యేక అధికారి వచ్చి పరిస్థితిని పరిశీలించి వెళ్లిపోయారు. 

వరద ఉధృతి కారణంగా బోటు ఇసుకులో కూరుకుపోయి ఉంటుందని. దాన్ని బయటకు తీయడం సాధ్యం కాదని చాలా మంది భావించారు. అటువంటి స్థితిలో ధర్మాడి సత్యంను రంగంలోకి దింపారు. రూ.22..70 లక్షలకు ఆయనకు చెందిన బాలాజీ మెరైన్స్ కు కాంట్రాక్టు అప్పగించారు. ఆయన 15 రోజుల పాటు తీవ్రంగా శ్రమించారు. 

విశాఖ నుంచి స్కూబా డైవింగ్ (అండర్ వాటర్) నిపుణులను పిలిపించారు. పలు ప్రయత్నాల తర్వాత బోటును వెలికి తీయగలిగారు. రాయల్ వశిష్ట బోటు వెలికితీతపై ధర్మాడి సత్యం ప్రతిస్పందించారు. కష్టాలకు ఎదురీదామని ఆయన అన్నారు. నీటిలో మునిగిన బోట్లను వెలికి తీయడంలో తనకు 35 ఏళ్ల అనుభవం ఉందని ఆయన చెప్పారు. 

యానాంలో నీట మునిగిన లాంచీని వెలికి తీశానని, దానికి సంబంధించిన డబ్బులను ఇప్పటికి కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. రాయల్ వశిష్ట బోటును వెలికి తీయడానికి చాలా శ్రమించామని, రోప్ లు తెగిపోయాయని, నదీ గర్భంలో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల లోపలికి వెళ్లడం కష్టమైందని ఆయన అన్నారు. 

బోటు ప్రమాదం వల్ల పలువురు జల సమాధి అయ్యారని, కనీసం వారి బంధువులకు చివరి చూపు కోసమైనా మృతదేహాలను చూపించలేకపోతున్నామనే బాధ ఉండిపోయిందని ధర్మాడి సత్యం అన్నారు.  

Operation Royal vasista: ధర్మాడి సత్యం బీ ప్లాన్ సక్సెస్, బోటు ఎలా తీశారంటే.....

 

click me!