ఏ వేడుకైనా 50 మంది దాటొద్దు: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

By narsimha lode  |  First Published Apr 26, 2021, 7:22 PM IST

కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకొంది.రాష్ట్రంలో ఏ వేడుకకైనా 50 మందికే అనుమతిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.


అమరావతి:కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకొంది.రాష్ట్రంలో ఏ వేడుకకైనా 50 మందికే అనుమతిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.ఏపీరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఈ  మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.  సోమవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. 

క్రీడా ప్రాంగణాలు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ ను   తాత్కాలికంగా మూసివేయాలని  వైద్యశాఖ ఆదేశించింది.   అంతేకాదు 50 శాతం సామర్ధ్యంతోనే  ప్రజా రవాణా, సినిమాహాళ్లను అనుమతించనున్నారు.ప్రతి కార్యాలయంలో 50 గజాల దూరం పాటించాలని  వైద్య శాఖ స్పష్టంగా ఆయా కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది.

Latest Videos

 ఒకే కాల్ సెంటర్ ద్వారా  ఆసుపత్రుల్లో బెడ్స్, ఆడ్మిషన్లు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.రెమిడెసివిర్ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఏపీలో 18 నుండి 45 ఏళ్లు దాటినవారు 2.45 లక్షల మంది ఉన్నారని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ కోసం వివిధ కంపెనీలతో మాట్లాడామని ఆయన చెప్పారు.ఉత్పత్తితో సంగం కేంద్రానికి, తర్వాతే రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. 

click me!