
కర్నూల్: ఉల్లి కొనుగోలు నిలిపివేయడంతో ఉల్లి రైతులు గురువారం నాడు కర్నూల్ పట్టణంలో నిరసనకు దిగారు. మార్కెట్ యార్డుకు ఎదురుగా రోడ్డుపై వాహనాలను అడ్డు పెట్టి రైతులు నిరసనకు దిగారు.
ఈనాం పద్దతిలోనే ఉల్లిని కొనుగోలు చేయాలని వ్యాపారులను అధికారులు ఆదేశించారు. అయితే ఈనాం పద్దతిలోత కొనుగోలు చేయడంతో తమకు లాభం లేదని వ్యాపారులు 10 రోజులుగా ఉల్లి కొనుగోలును నిలిపివేశారు.
అయితే బుధవారం నాడు కొనుగోళ్లను ప్రారంభించారు. అయితే బహిరంగ మార్కెట్‌లో కంటే అతి తక్కువకే ఉల్లిని కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఇవాళ్టి నుండి వ్యాపారులు ఉల్లి కొనుగోళ్లను నిలిపివేశారు.ఉల్లి కొనుగోలును నిలిపివేయడంతో మార్కెట్ యార్డుకు ఎదురుగా ఉన్న రోడ్డుపై వాహనాలను నిలిపివేసి రైతులు నిరసనకు దిగారు.