సీఎంఓ నుండి పిలుపు రావడంతో ఒంగోలు ఎస్పీ, కలెక్టర్లు ఇవాళ తాడేపల్లికి చేరుకున్నారు. సీఎంఓ సెక్రటరీ ధనుంజయ రెడ్డితో సమావేశమయ్యారు.
అమరావతి: సీఎంఓ నుండి పిలుపు రావడంతో ఒంగోలు కలెక్టర్, ఎస్పీలు శుక్రవారం నాడు తాడేపల్లి సీఎంఓకు చేరుకున్నారు. ఒంగోలు ఎస్పీ, కలెక్టర్ లు సీఎంఓ సెక్రటరీ ధనుంజయ రెడ్డితో సమావేశమయ్యారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిన్న సీఎంఓ అధికారులతో సమావేశమయ్యారు. ఒంగోలు జిల్లాలో ఫేక్ డాక్యుమెంట్ స్కాంవిషయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గన్ మెన్లను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సరెండర్ చేశారు.
భూ కుంభకోణం విషయమై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎంఓ నుండి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మరోసారి పిలుపు వచ్చింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడ ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఒంగోలు జిల్లాలో భూకుంభకోణానికి సంబంధించి చర్చించే అవకాశం ఉంది.
undefined
ఫేక్ డాక్యుమెంట్ల జిల్లాలొో విషయం వెలుగు చూసింది.ఈ విషయంలో ఎవరున్నా కఠినంగా శిక్షించాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అధికారులను కోరారు. ఈ స్కాంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఉన్నా కూడ వదిలిపెట్టవద్దని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్పీని కోరారు. కానీ తన మాటను పోలీసులు పట్టించుకోలేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన గన్ మెన్లను సరెండర్ చేశారు.ఈ మేరకు మూడు రోజుల క్రితం డీజీపీకి లేఖ రాశారు.
ఈ విషయమై సీఎంఓ నుండి పిలుపు రావడంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిన్న సీఎంఓకు చేరుకున్నారు. ఒంగోలులో చోటు చేసుకున్న పరిణామాలపై సీఎంఓ అధికారులతో చర్చించారు. ఇవాళ సీఎంఓ సెక్రటరీ నుండి ఒంగోలు కలెక్టర్, ఎస్పీలకు సీఎంఓ నుండి పిలుపు వచ్చింది. దీంతో ఇవాళ కలెక్టర్, ఎస్పీలు సీఎంఓ సెక్రటరీతో భేటీ అయ్యారు. ఫేక్ డాక్యుమెంట్ల స్కాం దర్యాప్తు విషయంలో ఎదురౌతున్న ఇబ్బందుల గురించి చర్చించనున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కూడ సీఎంఓ నుండి పిలుపు అందింది.