చంద్రబాబుకి కేంద్రం మరో షాక్..

By ramya NFirst Published Feb 6, 2019, 11:10 AM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబుకి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. అదనపు రుణాలు పొందే అర్హత ఏపీకి లేదని తేల్చి చెప్పింది. 

ఏపీ సీఎం చంద్రబాబుకి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. అదనపు రుణాలు పొందే అర్హత ఏపీకి లేదని తేల్చి చెప్పింది. 14వ ఆర్థిక సంఘం నిర్దేశితాల ప్రకారం ఏపీ 2018-19 సంవత్సరంలో షరతులను పూర్తి చేయలేదని.. అందువల్ల అదనపు రుణాలు పొందేందుకు ఏపీ ప్రభుత్వానికి అర్రహత లేదని కేంద్రం ప్రకటించింది.

రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర ఆర్థఇక శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఈ విషయం వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం ఏపీ, తెలంగాణ రెండింటికీ జీఎస్డీపీలో మూడు శాతం మేరకు ఆర్థికలోటుకు పరిమితి విధించిందని కేంద్రం పేర్కొంది.

అయితే రుణ జీఎస్డీపీ నిష్పత్తి 25శాతం దాటకుండా, వడ్డీ చెల్లింపులు- ఆదాయ వసూళ్ల నిష్పత్తి 10శాతం మించకుండా ఉంటే ఈ ఆర్థికలోటు పరిమితిలో కూడా సడలించవచ్చని ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని తెలిపారు.

దీని ప్రకారం.. తెలంగాణకు మాత్రమే రూ.2052 కోట్ల మేరకు అదనపు రుణాలు అందుకునే అర్హత లభించిందన్నారు. 2018-19లో జీఎస్డీపీలో 0.25శాతానికి సమానంగా ఈ మొత్తం ఉంటుందని, అది మూడు శాతం సాధారణ పరిమితికి అదనంగా లభిస్తుందని ఆయన చెప్పారు. కాగా.. ఎఫ్ఆర్బీఎం పరిమితిని 0.5శాతం పెంచాలని ఏపీ ప్రభుత్వం కోరిందని.. కానీ షరతులు పూర్తి చేయనందున రాష్ట్రానికి అర్హత లేదన్నారు.

అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఈఏపీల ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీని చెల్లించేందుకు రూ.15.81 కోట్లు విడుదల చేశామని మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానంగా చెప్పారు. కాగా, వెనుకబడిన జిల్లాల నిధులపై గల్లా జయదేవ్‌ ప్రశ్నించగా.. రూ.350 కోట్లు విడుదల చేసి, ప్రక్రియలో లోపాల వల్ల తిరిగి వెనక్కి తీసుకున్నామని హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ లోక్‌సభలో తెలిపారు.

click me!