పాయకరావుపేటలో లారీని ఢీకొన్న కారు... ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు

Published : Mar 29, 2023, 11:15 AM IST
పాయకరావుపేటలో లారీని ఢీకొన్న కారు... ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు

సారాంశం

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోగా ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. 

అనకాపల్లి : హైవేపై వేగంగా దూసుకుపోతున్న కారు అదుపుతప్పడంతో అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. 

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద జాతీయ రహదారి పక్కన ఆగివున్న లారీని కారు ఢీ కొట్టింది. విజయవాడ నుండి విశాఖపట్నం వెళుతున్న కారు సీతారాంపురం జంక్షన్ వద్దకు రాగానే అదుపుతప్పి అమాంతం రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఇలా రోడ్డుపక్కన నిలిపిన లారీని వేగంగా వెళ్ళి ఢీకొట్టడంతో కారు బాగా దెబ్బతిని ఐదుగురు అందులోనే చిక్కుకున్నారు. 

వెంటనే ప్రమాదంపై సమాచారం అందకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులో చిక్కుకున్నవారిని కాపాడారు. అప్పటికే ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు తీవ్ర గాయాలతో రక్తపుమడుగులో పడివున్నారు. వారిని వెంటనే అంబులెన్స్ లో తుని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందేలా చూసారు. గాయపడిన వారి పరిస్థితి కూడా అత్యంత విషమంగా వున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.ఈ ప్రమాదానికి గురయిన వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు...అలాగే ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu