మరోసారి జగన్, కేసీఆర్ భేటీ... అసలు మ్యాటర్ ఇదే

By telugu teamFirst Published Jun 25, 2019, 9:52 AM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి భేటీ కానున్నారు. ఈ నెల 28వ తేదీన ప్రగతిత భవన్ లో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి భేటీ కానున్నారు. ఈ నెల 28వ తేదీన ప్రగతిత భవన్ లో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరు ఇరువురూ కలవడం ఇది నాలుగోసారి.

ఇరిగేషన్, విద్యుత్, పౌరసరఫరాల శాఖల్లో విభజన సమస్యలతో పాటు కీలక అంశాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక లావాదేవీల సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు దృష్టిసారించారు. విద్యుత్, పౌరసరఫరాల శాఖల్లో చిక్కుముడిగా ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఇరువురు సీఎంల చర్చ జరగనుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు పరిష్కార మార్గాలు అన్వేషణ చేయనున్నారు. విద్యుత్ ఉద్యోగుల విభజనపైనా ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరగనుంది.
 
మరోవైపు.. జులై 3న గవర్నర్‌ సమక్షంలో తెలంగాణ, ఏపీ సీఎస్‌ల సమావేశం జరగనుంది. సీఎంల భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై సీఎస్‌ల మధ్య చర్చించనున్నారు. ఇరిగేషన్, విద్యుత్‌, పౌరసరఫరాల శాఖల అధికారులతో సోమవారం నాడు తెలంగాణ సీఎస్‌ ఎస్కే జోషి సమీక్ష నిర్వహించిన విషయం విదితమే.

click me!