రాయలసీమ రౌడీయిజం ఇక్కడ కాదు..: బైరెడ్డి సిద్దార్థ్ పై ఒలింపిక్స్ సంఘం సభ్యుడి అనుచిత వ్యాఖ్యలు (వీడియో)

By Arun Kumar PFirst Published Mar 23, 2023, 5:01 PM IST
Highlights

విజయవాడలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ మీటింగ్ లో ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డిపై ఒలింపిక్స్ అసోసియేషన్ సభ్యుడొకరు అనుచిత వ్యాఖ్యలు చేసారు. 

విజయవాడ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (శాప్) ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డిపై ఒలింపిక్ అసోసియేషన్ సభ్యడు కేపి రావు అనుచిత వ్యాఖ్యలు చేసారు. విజయవాడలో జరిగిన శాప్ మీటింగ్ లో సిద్దార్థ్ రెడ్డిని పట్టుకుని హూ ఆర్ యూ అంటూ నిలదీసారు కేపి రావు. అంతేకాదు రాయలసీమ రౌడీయిజం ఇక్కడ చేయవద్దంటూ బైరెడ్డి ముఖంమీదే చెప్పారు. దీంతో సిద్దార్థ్ అనుచరులు కేపి రెడ్డి వాగ్వాదానికి దిగడంతో శాప్ మీటింగ్ రసాభాసగా మారింది. 

ఏపీలో క్రీడల అభివృద్దిపై చర్చించేందుకు శాప్ ఆధ్వర్యంలో అన్ని స్పోర్ట్స్ అసోసియేషన్లతో విజయవాడలో మీటింగ్ ఏర్పాటుచేసారు. ఈ సమావేశానికి మంత్రి రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డితో అన్ని స్పోర్ట్ అసోసియేషన్ల సభ్యులు పాల్గొన్నారు. అయితే మీటింగ్ మధ్యలో ప్రసంగం విషయంలో ఒలింపిక్స్ అసోసియేషన్ సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో బైరెడ్డి కలుగజేసుకుని వివాదాల పరిష్కారినే ఈ మీటింగ్ తప్ప కొత్త వివాదాలు సృష్టించడానికి కాదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే కేపి రావు బైరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసారు.

వీడియో

 బైరెడ్డిపై కేపీ రావు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన అనుచరులు , వివిధ అసోసియేషన్ల సభ్యులు తప్పుబట్టారు. బాధ్యతాయుత పదవిలో వున్న సిద్దార్థ్ ను పట్టుకుని అమర్యాదగా మాట్లాడటం... రాయలసీమ రౌడీయిజం అనడాన్ని తప్పుబట్టారు. కేపి రావుతో వాగ్వాదానికి దిగిన తన అనుచరుల బైరెడ్డి సముదాయించారు. మిగతావారిని కూడా మంత్రి రోజా, ఇతర సభ్యులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. 

వివాదంపై బైరెడ్డి మాట్లాడుతూ...రాష్ట్రంలోని స్పోర్ట్స్ అసోసియేషన్ల మద్య నెలకొన్న వివాదాలు పరిష్కరించడానికే ఈ మీటింగ్ పెట్టామన్నారు. అసోసియేషన్ల గొడవలతో క్రీడాకారులకు ఇబ్బందులుపెట్టద్దని సూచించామని అన్నారు. అయితే కొందరు కావాలనే రెచ్చగొట్టి వివాదం సృష్టించాలని చూసారని అన్నారు. ఏపీలో స్పోర్ట్స్ సర్వనాశనం కావాడానికి కారకులు ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఏపీలో క్రీడల అభివృద్దికి మాత్రమే స్పోర్ట్ అసోసియేషన్లు పనిచేయాలని బైరెడ్డి సిద్దార్థ్ స్పష్టం చేసారు. 

click me!