గాజువాకలో పేలిన ఆయిల్ ట్యాంకర్: తునాతనకలైన కార్మికుడు

Siva Kodati |  
Published : May 28, 2019, 01:18 PM IST
గాజువాకలో పేలిన ఆయిల్ ట్యాంకర్: తునాతనకలైన కార్మికుడు

సారాంశం

విశాఖలో దారుణం జరిగింది. గాజువాక ఆటోనగర్‌లో ఓ ఆయిల్ ట్యాంకర్ పేలిపోయింది. ట్యాంకర్‌కు వెల్డింగ్ పనులు చేస్తుండగా.. భారీ శబ్ధంతో అది పేలిపోయింది. 

విశాఖలో దారుణం జరిగింది. గాజువాక ఆటోనగర్‌లో ఓ ఆయిల్ ట్యాంకర్ పేలిపోయింది. ట్యాంకర్‌కు వెల్డింగ్ పనులు చేస్తుండగా.. భారీ శబ్ధంతో అది పేలిపోయింది. ఈ ఘటనలో నాగేశ్వరరావు అనే కార్మికుడు మరణించగా..  మరో హెల్పర్ తీవ్ర గాయాల పాలవ్వడంతో అతనిని ఆసుపత్రికి తరలించారు.

మృతుడు నాగేశ్వరరావు ఆటోనగర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. వెల్డింగ్ పనిపై అవగాహన వుండటంతో అప్పుడప్పుడు ఆ పనికి కూడా వెళ్లేవాడు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆయిల్ ట్యాంకర్ పై భాగంలో వెల్డింగ్ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా ట్యాంకర్ పేలిపోయింది. పేలుడు ధాటికి అతను దూరంగా ఎగిరిపడ్డాడు. అతని శరీరం తునాతునకలు అయిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?