కృష్ణా జిల్లాలో కిషన్ రెడ్డికి చేదు అనుభవం.. మాట్లాడుతుండగా వెళ్లిపోయిన అధికారులు, కేంద్రమంత్రి సీరియస్

By Siva KodatiFirst Published Jul 31, 2022, 7:23 PM IST
Highlights

జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య స్వగ్రామం కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన మాట్లాడుతూ వుండగా అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు.

కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి (kishan reddy) చేదు అనుభవం ఎదురైంది. ఆయన మాట్లాడుతూ వుండగా అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య స్వగ్రామంలో ఆదివారం పర్యటించిన ఆయన.. గ్రామస్తులతో సమావేశమయ్యారు. అయితే జాయింట్ కలెక్టర్‌తో పాటు కొంతమంది అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాను వస్తే ఆర్డీవో , జాయింట్ కలెక్టర్ ఎలా వెళ్లిపోతారంటూ ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

అంతకుముందు ఆయన మాట్లాడుతూ.. జాతీయ జెండా రూపకర్త Pingali Venkayya కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్  ఉందన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదన కేంద్రానికి వచ్చిన విషయం తనకు తెలియదన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శత జయంతి సందర్భంగా ఆగష్టు 2న  ఢిల్లీలో కార్యక్రమాలను నిర్వహిస్తామని కిషన్ రెడ్డి వివరించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి వివరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  ఆగష్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేయాలని మంత్రి కోరారు. 

Also REad:పింగళి వెంకయ్యకు భారత రత్నపై కేంద్రం నిర్ణయం: కిషన్ రెడ్డి

Telamgana CM  కేసీఆర్ నెలలో ఒక్క రోజూ కూడా సచివాలయానికి రాడని కిషన్  రెడ్డి ఎద్దేవా చేశారు. KCR 20 రోజులు ఫామ్ హౌస్ లో ఉంటే 10 రోజులు ఇంట్లో ఉంటారని, సచివాలయానికి ఎప్పుడూ రారని ఆయన దుయ్యబట్టారు. ఎనిమిదేళ్లుగా ప్రధాని Narendra Modi  ఒక్క సెలవు కూడా తీసుకోలేదని... తాము కూడా సెలవులు తీసుకోకుండా పనిచేస్తున్నామన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ఇవాళే Hyderabad కు చేరుకొన్నారని... ఐదు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో ఏం చేశారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

click me!