అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిని మేడపై నుంచి తోసేసిన తోటి విద్యార్థినులు

Published : Mar 18, 2023, 04:09 PM IST
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిని మేడపై నుంచి తోసేసిన తోటి విద్యార్థినులు

సారాంశం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ముక్తేశ్వరంలో ఓ నర్సింగ్ విద్యార్థినిని ఆమె తోటి విద్యార్థినిలు మేడపై నుంచి తోసేశారు. 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ముక్తేశ్వరంలో ఓ నర్సింగ్ విద్యార్థినిని ఆమె తోటి విద్యార్థినిలు మేడపై నుంచి తోసేశారు. ఈ ఘటనలో విద్యార్థినికి మూడు చోట్ల కాలు, చెయ్యి ఎముకలు విరిగాయి. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. వివరాలు.. బాధిత విద్యార్థిని పల్లవి వైవిఎస్ అండ్ బీఆర్ఎస్‌ఎం కాలేజీలో నర్సింగ్ మొదటి సవత్సరం చదువుతుంది. అయితే రాత్రి హాస్టల్‌లో ఒకరి డబ్బులు పోయాయని.. మిగిలిన విద్యార్థుల బ్యాగులను తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే పల్లవికి, మిగిలిన విద్యార్థులకు మధ్య గొడవ జరిగింది.

అయితే  ఈరోజు ఉదయం రెండో అంతస్థులో తాను బ్రెష్ చేస్తున్న సమయంలో పల్లవిని కొందరు వెనకాల నుంచి నెట్టడంతో ఆమె పడిపోయింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే రాత్రి హాస్టల్‌లో ఒకరి డబ్బులు పోయాయని ఇందుకు సంబంధించి గొడవ జరిగిందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పల్లవి తెలిపింది. తాను ఉదయం బ్రెష్ చేస్తున్న సమయంలో వెనకనుంచి నెట్టారని చెప్పింది.  

PREV
click me!

Recommended Stories

బాబుకు కొత్త బిరుదు ఇచ్చిన నిమ్మల | Nimmala Ramanaidu Speech | Asianet Telugu
Nara Lokesh VS Varma | CM Chandrababu Naidu | Asianet Telugu