ఏలూరు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం: విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం

By narsimha lode  |  First Published Aug 29, 2023, 11:55 AM IST

ఏలూరు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో  ర్యాగింగ్ కలకలం చోటు చేసుకుంది.



ఏలూరు:  ఏలూరు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో  ర్యాగింగ్ కలకలం చోటు చేసుకుంది. ర్యాగింగ్ కారణంగా  ఓ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది.  ర్యాగింగ్ పేరుతో సీనియర్లు  వేధింపులకు పాల్పడిన కారణంగా విద్యార్ధిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.బాధిత విద్యార్ధినిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతుంది.

దేశ వ్యాప్తంగా  పలు విద్యాసంస్థల్లో ఏదో ఒక చోట  ర్యాగింగ్ ఘటనలు  చోటు చేసుకుంటున్నాయి.  ర్యాగింగ్ కు వ్యతిరేకంగా  ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకువచ్చినా కొన్ని విద్యాసంస్థల్లో  ర్యాగింగ్ ఘటనలు చోటు  చేసుకుంటున్నాయి. ర్యాగింగ్ తో  విద్యార్థులు  కొందరు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు  చోటు చేసుకున్న సమయంలో  అధికారులు  స్పందిస్తున్నారు. 

Latest Videos

undefined

బెంగాల్ రాష్ట్రంలోని  జాదవ్ పూర్ యూనివర్శిటీలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి  హస్టల్ రెండో అంతస్థు నుండి పడి మృతి చెందాడు. ర్యాగింగ్ లో భాగంగా  యువకుడిని నగ్నంగా ఊరేగించారని  ఆరోపణలు వచ్చాయి.ఈ ఘటనలో  ఇప్పటికే  13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ మెడికల్ విద్యార్ధిని ప్రీతి  ఆత్మహత్యకు  సీనియర్ వేధింపులు కారణమని పోలీసులు  చార్జీషీట్ లో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్  7వ తేదీన  పోలీసులు చార్జీషీట్ లో ఈ అంశాన్ని  పేర్కొన్నారు.

తెలంగాణలోని నిజామాబాద్ డిచ్ పల్లి ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడ్డారు.  ఈ విషయమై  బాధితులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది మార్చి 16న ఈ ఘటన చోటు చేసుకుంది.

అసోం రాష్ట్రంలోని దిబ్రూగడ్ యూనివర్శిటీలో  ఓ విద్యార్ధి ఆత్మహత్యాయత్నం ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ ఘటన  2022  నవంబర్ లో చోటు చేసుకుంది.   సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక జూనియర్ విద్యార్థి రెండో అంతస్థు నుండి దూకాడు.దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

ఆత్మహత్యలు పరిష్కారం కావు

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.
 

click me!