ఏలూరు జిల్లాలో.. ఎన్టీఆర్ విగ్రహం మాయం..

By SumaBala BukkaFirst Published Dec 9, 2022, 8:47 AM IST
Highlights

ఏలూరు జిల్లాలో ఏన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసిన మరుసటి రోజే మాయం అవ్వడం కలకలం రేపుతోంది. 

ఏలూరు జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ఎన్టీఆర్ విగ్రహం మాయం అయింది. ఇది స్థానికంగా సంచలనంగా మారింది. ఈ నెల ఆరవ తేదీన శివాపురం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అది ఇప్పుడు మాయమయింది. దీంతో ఈ ఘటన మీద టిడిపి శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. శివాపురంలో, చింతలపూడి బోసుబొమ్మ కూడలిలో ఆందోళన చేపట్టారు. దీనికి కారణమైన  నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చింతలపూడి పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదులు చేశారు.

అనుమానితులుగా  శివాపురం గ్రామానికి చెందిన గవర చిన్నారావు, నవీన్,  శేఖర్, వెంకటేశ్వరరావులను పేర్కొన్నారు. వీరంతా కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని న్యాయం చేసినట్లు తమకు అనుమానంగా ఉందని  తెలిపారు.  ఈ మేరకు తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు తదితరులు పేర్కొన్నారు. దీనికి కారణం ఉందని… విగ్రహం ఏర్పాటు చేసే సమయంలోనే వీరు  గొడవ చేయడానికి ప్రయత్నించారని.. 24 గంటల్లో మాయం చేస్తామని.. శపథం చేసినట్లు పేర్కొన్నారు. టిడిపి నాయకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లేశ్వర రావు తెలిపారు. 

click me!