నాడు 31 మంది మంత్రులకు ఎన్టీఆర్ ఉద్వాసన, జగన్ కేబినెట్లో నేడు 24 మంది రాజీనామా

Published : Apr 07, 2022, 07:24 PM ISTUpdated : Apr 07, 2022, 07:38 PM IST
నాడు 31 మంది మంత్రులకు ఎన్టీఆర్ ఉద్వాసన,  జగన్ కేబినెట్లో నేడు 24 మంది రాజీనామా

సారాంశం

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎన్టీఆర్ 31 మంది మంత్రులను తొలగించారు. అయితే జగన్ మాత్రం ముందుగానే ప్రకటించినట్టుగా తన మంత్రివర్గం నుండి 24 మందిని తప్పించారు. ఈ నెల 11న మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించనున్నారు.  

అమరావతి: నాడు NTR బడ్జెట్ లీకైందనే విషయమై మంత్రి వర్గం నుండి 31 మంది మంత్రులను తప్పించారు. అయితే ముందుగానే ఇచ్చిన హామీ మేరకు 24 మంది మంత్రులను సీఎం జగన్ రాజీనామాలు కోరారు.   

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాస్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 31 మంది మంత్రులను తొలగిస్తే, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ 24 మంది మంత్రుల నుండి Resignation చేయించారు. 

1985లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగాఎన్టీఆర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ పాలనలో అంతకు ముందు కంటే కొన్ని మార్పులు చోటు చేసుకొన్నాయి. అవినీతి ఆరోపణలతో పాటు పలు అంశాల్లో ఎన్టీఆర్ తీసుకొన్న నిర్ణయాలపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వచ్చింది. ఈ కారణాలతో 1989లో TDP  ఓటమి పాలైంది.ఈ ఓటమికి  ఏకంగా మంత్రుల ఉద్వాసన కూడా కారణమైందనే ప్రచారం అప్పట్లో  జరిగింది.

ఎన్నికలకు ముందు బడ్జెట్ లో అంశాలు మీడియాకు లీకైన విషయమై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి.ఈ పరిణామాలను సీరియస్ గా తీసుకొన్న ఎన్టీఆర్ తన మంత్రివర్గంలోని 31 మందిని మంత్రి వర్గం నుండి భర్తరఫ్ చేశారు.  ఈ 31 మందిలో సీనియర్లు కూడా ఉన్నారు. భర్తరఫ్ చేసిన 31 మంది స్థానంలో 23 మందిని మంత్రివర్గంలోకి ఎన్టీఆర్ తీసుకొన్నారు.

2019 మే మాసంలో అవశేష ఆంధ్రప్రదేశ్ రాస్ట్రంలో YS Jagan సీఎంగా బాధ్యతలు చేపట్టారు.  జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన  మంత్రివర్గం కూర్పు సమయంలో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్నారు.  మంత్రివర్గంలోకి ప్రస్తుతం తీసుకున్న సమయంలోనే  వారిని రెండున్నర ఏళ్లు మాత్రమే కొనసాగిస్తామని సీఎం జగన్ చెప్పారు. అయితే  corona నేపథ్యంలో మరో ఆరు మాసాలు ఆలస్యంగా మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణకు జగన్ ముహుర్తం నిర్ణయం తీసుకొన్నారు. తన కేబినెట్ లో ఉన్న 24 మంది మంత్రులతో సీఎం జగన్ రాజీనామా చేయించారు.  అయితే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో నలుగురైదుగురు తిరిగి  మంత్రి వర్గంలో చోటు దక్కించుకొనే అవకాశం ఉంది. అనుభవం ఉన్న మంత్రులకు తొలి ప్రాధాన్యత దక్కనుంది.

మంత్రులుగా ప్రమాణం చేసే సమయంలోనే రెండున్నర ఏళ్లే తాము ఈ పదవిలో ఉంటామని ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారికి తెలుసు. అయితే ఈ విషయమై మానసికంగా కూడా మంత్రులు సిద్దమై ఉన్నారు. ఇవాళే చివరి కేబినెట్ సమావేశం జరిగింది.ఈ కేబినెట్ సమావేశంలోనే మంత్రులు రాజీనామాలను సమర్పించారు. ఈ రాజీనామాలను జీఏడీ అధికారులు governor కార్యాలయానికి పంపుతారు. ఈ నెల 10న కొత్త మంత్రులుగా ప్రమాణం చేసే వారి పేర్లు గవర్నర్ కార్యాలయానికి చేరుతాయి.

ఎన్టీఆర్ హయంలో చోటు చేసుకొన్న పరిణామాలు వేరుగా ఉన్నాయి. ఆ సమయంలో ఉద్వాసనకు గురైన మంత్రులతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వారితో జత కలిశారు. బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు.  ఆ సమయంలో స్పీకర్ తీరుపై కూడా ఎన్టీఆర్ కొంత అసంతృప్తితో ఉన్నారు. సీపీఐ నేత రాజేశ్వరరావు ప్రవేశ పెట్టిన తీర్మానంపై చర్చకు అనుమతి ఇవ్వడాన్ని ఎన్టీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. తీర్మానాన్ని తిరస్కరించి చర్చకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఈ అవకాశాన్ని తీసుకొని ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కొందరు నేతలు బహిరంగంగానే  తమ అసంతృప్తిని  వ్యక్తం చేశారు. కేఈ కృష్ణమూర్తి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడారు.

అయితే అసంతృప్తివాదులతో పి. ఉపేంద్ర, చంద్రబాబు, రేణుకాచౌదరిలు మాట్లాడి వారిలో ఉన్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం  చేశారు. అసంతృప్తివాదులు 100 ఎమ్మెల్యేలున్నారని ప్రకటించారు. అయితే 196 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వాదులుగా చేరిన వారిలో ఎక్కువగా 1989లో టిక్కెట్లు రావనే భయం ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని అప్పట్లో ఎన్టీఆర్ మద్దతుదారులుగా ఉన్నవారు చెప్పారు. 

కానీ ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో మంత్రులు రాజీనామా పత్రాలను అందించారు. అయితే మూడేళ్ల క్రితమే మంత్రులకు ఈ విషయం తెలుసు. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో అనుభవం రీత్యా కొందరికి ఛాన్స్ దక్కనుంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu