బొత్స భేటీ: తోట నరసింహానికి వైసీపీ గాలం

First Published Feb 26, 2019, 11:16 AM IST

టీడీపీ ఎంపీ తోట నర్సింహంతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సోమవారం నాడు సమావేశమయ్యారు. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

: టీడీపీ ఎంపీ తోట నర్సింహంతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సోమవారం నాడు సమావేశమయ్యారు. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అనారోగ్య కారణాలతో వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీ స్థానానికి పోటీ చేయబోనని తోట నరసింహం ఇప్పటికే చంద్రబాబునాయుడును కోరారు. కానీ, తన భార్యకు జగ్గంపేట నుండి అసెంబ్లీ సీటు ఇవ్వాలని కోరారు.
undefined
త్వరలో ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ కీలకనేతతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు తోట నరసింహాం కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరారు. కాకినాడ నుండి ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.
undefined
పార్లమెంట్‌లో టీడీపీ పక్ష నేతగా తోట నరసింహాం వ్యవహరించారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉండాలని తోట నరసింహం నిర్ణయం తీసుకొన్నారు. అనారోగ్య కారణాలను చూపుతూ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చంద్రబాబుకు తోట నరసింహాం తేల్చి చెప్పారు.
undefined
మాగంటి బాబును పక్కన పెట్టి మాజీ ఎంపీ బోళ్ల బుల్లిరామయ్య మనవడు రాజీవ్ ను ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీకి దింపవచ్చుననే ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తూ రాజీవ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో రాజీవ్ భేటీ అయ్యారు.
undefined
గత ఎన్నికల్లో జగ్గంపేట నుండి జ్యోతుల నెహ్రు వైసీపీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత నెహ్రు టీడీపీలో చేరారు. నెహ్రును తప్పించి వాణికి ఈ స్థానంలో టిక్కెట్టు ఇస్తారా అనే చర్చ సాగుతోంది.
undefined
ఈ పరిణామాలను రాజకీయంగా తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని వైసీపీ భావిస్తోంది. తోట నరసింహంతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అరగంట పాటు చర్చించారు. తోట నరసింహం స్వంత గ్రామమైన వీరవరంలో బొత్స చర్చలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
undefined
click me!