ఏపీలో స్కూల్స్ కు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు: మంత్రి ఆదిమూలపు

Published : Jan 20, 2022, 03:22 PM IST
ఏపీలో స్కూల్స్ కు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు: మంత్రి ఆదిమూలపు

సారాంశం

రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.  పరీక్షలు కూడా నిర్వహించుకొనేందుకు కోర్టులు అనుమతిని ఇచ్చాయని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అమరావతి:   ఏపీ లో స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని ఏపీ  రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చి చెప్పారు.గురువారం నాడు ఈ విషయమై మంత్రి  Adimulap Suresh మీడియాతో మాట్లాడారు. విద్యార్ధులకు corona వస్తే ఆ స్కూల్ ను మూసివేసి శానిటైజ్ చేస్తామన్నారు. శానిటేషన్ తర్వాత స్కూల్ ను తిరిగి ప్రారంభిస్తామని  ఆయన తేల్చి చెప్పారు. కోర్టులు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చాయని ఆయన చెప్పారు.

అయితే రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులివ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వకపోవడం వల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని విపక్షాలు చెబుతున్నాయి. విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు.

Andhra Pradesh  రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రోజుల పాటు విద్యా సంస్థలకు holidays ఇచ్చింది. ఈ నెల 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఏపీ రాష్ట్రంలోని స్కూల్స్, కాలేజీలతో పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించింది. ఈ నెల 17 నుండి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Corona కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో ఏపీ రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారానికి ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెక్ పెట్టారు. రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగించే ఆలోచన లేదని ఏపీ మంత్రి సురేష్ తేల్చి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 17 నుండి 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.అయితే తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఏపీ రాస్ట్రంలో కూడా విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారానికి మంత్రి సురేష్ పుల్‌స్టాప్ పెట్టారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం నాడు రాష్టంలో 4 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీ రాష్ట్రంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కోడి పందెలు, గుండాటలు పెద్ద ఎత్తున నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఈ నెల 10వ తేదీ నుండే రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. అయితే సంక్రాంతిని పురస్కరించుకొని ఈ నెల 18 నుండి రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు గాను నైట్ కర్ఫ్యూతో పాటు మరికొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు.50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్‌, మాల్స్ ఓపెన్ చేయనున్నారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

దేవాలయాలు, ప్రార్థనామందిరాల్లో భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని జగన్ సర్కార్ ఆదేశించింది. ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు పోలీసులకు సూచించారు.మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధించాలన్నారు. బస్సుల్లో ప్రయాణికులు మాస్కు ధరించేలా చూడాలన్నారు. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి మించకూడదని ఇండోర్‌ కార్యక్రమాల్లో 100 మందికి మించకూడదని ప్రభుత్వం ఆదేశించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu