కేంద్రంతో రాజీలేదు, బిజెపి కుట్రలు సాగవు: బాబు

First Published Jun 4, 2018, 4:54 PM IST
Highlights

బిజెపిపై నిప్పులు చెరిగిన బాబు


విజయనగరం:కేంద్రంతో రాజీపడే ప్రసక్తేలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్రానికి న్యాయం జరగాలనే డిమాండ్ తో ధర్మపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బిజెపి కుట్రలో వైసీపీ భాగస్వామిగా మారిందన్నారు.వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకొనే పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించాలని బాబు ప్రజలను కోరారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబునాయుడు సోమవారం నాడు పాల్గొన్నారు. 

కేంద్రం న్యాయం చేస్తోందని సహనంతో వేచి చూసినట్టు చెప్పారు. కానీ, కేంద్రం నుండి సానుకూలమైన స్పందన రాని కారణంగా హక్కుల సాధన కోసం ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టు చెప్పారు.
రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసమే బిజెపితో పొత్తు పెట్టుకొన్నట్టుగా బాబు చెప్పారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీ ప్రజలకు ఇచ్చిన  హమీలను మోడీ నెరవేర్చలేదని చంద్రబాబునాయుడు విమర్శించారు. 

రాష్ట్రంలో బిజెపి కుట్రలు పన్నుతోందన్నారు. బిజెపి కుట్రలను సాగకుండా అడ్డుకొంటానని చంద్రబాబునాయుడు చెప్పారు. బిజెపి కుట్రలో వైసీపీ భాగస్వామిగా మారిందని బాబు విమర్శలు గుప్పించారు. 


ఎన్నికలు రావనే ధైర్యంతోనే వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలుఆడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. వైసీపీకి ధైర్యముంటే మోడీపై పోరాటం చేయాలన్నారు.వచ్చే ఎన్నికల్లో బిజెపితో కలసి పోటీచేసే పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించాలని ఆయన ప్రజలను కోరారు. 

కేంద్రం, ఆర్భీఐ ఒప్పుకోకపోయినా రైతాంగానికి రుణ మాఫీని చేసినట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. పంటకు గిట్టుబాటు లభించేలా చర్యలు తీసుకొంటున్నామన్నారు. 


 

click me!