చంద్రబాబు లేఖపై స్పందించను: సిఈవో ద్వివేది

By Nagaraju penumalaFirst Published Apr 26, 2019, 8:10 PM IST
Highlights

నిబంధనల ప్రకారమే తాను పనిచేస్తున్నానని ఏ అంశంలో కూడా సొంత నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల నియమాళి ఉల్లంఘన తనకు అప్రస్తుతమంటూ చెప్పుకొచ్చారు. ఆ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చూసుకుంటుందని స్పష్టం చేశారు. రాజకీయపరమైన అంశాలపై తాను స్పందించలేనని స్పష్టం చేశారు.

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాసిన 9పేజీల లేఖపై తాను స్పందిచాల్సిన అవసరం లేదన్నారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. సమీక్షలు అడ్డుకోవద్దు అంటూ రాసిన లేఖపై తాను స్పందించనని చెప్పారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఈసీ ఆదేశాలనే అమలు చేస్తున్నామన్నారు. నిబంధనల ప్రకారమే తాను పనిచేస్తున్నానని ఏ అంశంలో కూడా సొంత నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల నియమాళి ఉల్లంఘన తనకు అప్రస్తుతమంటూ చెప్పుకొచ్చారు. 

ఆ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చూసుకుంటుందని స్పష్టం చేశారు. రాజకీయపరమైన అంశాలపై తాను స్పందించలేనని స్పష్టం చేశారు. రాజకీయపార్టీలు, అభ్యర్థులు, అధికారులకు సీఈసీ నుంచి వచ్చిన ఎన్నికల నియమావళి పుస్తకాలను అందజేయనున్నట్లు సిఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 
 

click me!