ఆ జంట హత్యల మిస్టరీ ఇంకా వీడలేదు

Published : Feb 12, 2019, 11:45 AM IST
ఆ జంట హత్యల మిస్టరీ ఇంకా వీడలేదు

సారాంశం

శ్రీకాకుళం మండలంలోని చాపురం పంచాయితీ పరిధిలోని బొందిలిపురం విజయ్‌నగర్ కాలనీలో  ఈ నెల 7వ తేదీన హత్యకు గురైన మెహరున్నీషా, జురాబాయ్‌ల కేసు మిస్టరీ వీడలేదు.  

శ్రీకాకుళం: శ్రీకాకుళం మండలంలోని చాపురం పంచాయితీ పరిధిలోని బొందిలిపురం విజయ్‌నగర్ కాలనీలో  ఈ నెల 7వ తేదీన హత్యకు గురైన మెహరున్నీషా, జురాబాయ్‌ల కేసు మిస్టరీ వీడలేదు.

వీరిద్దరూ హత్యకు గురై ఐదు రోజులు కావస్తోన్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి కన్పించలేదు. మృతదేహాలపై  హంతకుల వేలిముద్రలు లభించలేదు.  ఈ  హత్యలు జరిగిన రోజున ఇంట్లో నుండి  ఉన్న నగలను మాత్రం దుండగులు పట్టుకెళ్లలేదు.  పోలీసుల దర్యాప్తులో ఈ విషయాన్ని గుర్తించారు.  

ఈ హత్యలు పోలీసులకు సవాల్‌గా మారింది.  ఈ హత్యలకు కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆస్తి తగాదాలా.... ఇంకా మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో  కూడ  పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఇంటికి  హత్య జరిగిన రోజున ఎవరెవరు వచ్చారనే కోణంలో కూడ పోలీసులు  ఆరా తీస్తున్నారు.  ప్రతి ఒక్కరిని  పోలీసులు విచారిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Minister Savitha రక్తం ఏరులై పారించిన చరిత్ర నీది జగన్ పై మంత్రి సవిత ఆగ్రహం.. | Asianet News Telugu
Chandrababu Naidu: సంజీవిని పని తీరు అడిగితెలుసుకున్న సీఎం చంద్రబాబు| Asianet News Telugu