
రాష్ట్రానికి విభజన హామీలు, ప్రత్యేకహోదా వెంటనే అమలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికి వినతిపత్రం అందజేయనున్నారు. ఏపీ భవన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలను వెంటబెట్టుకుని ఆయన రాష్ట్రపతిభవన్‌కు పాదయాత్రగా బయలుదేరారు. చంద్రబాబు వెంట 11 మంది ప్రతినిధుల బృందం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మొత్తం 18 డిమాండ్లపై చంద్రబాబు బృందం రాష్ట్రపతికి వినతిపత్రం అందజేయనుంది.