జగన్ సంచలన నిర్ణయం: హోదా ఉద్యమ కేసులు ఎత్తివేత, జీవో విడుదల

By Nagaraju penumalaFirst Published Sep 13, 2019, 3:55 PM IST
Highlights

ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీకి తగ్గట్టుగా వైయస్ జగన్ ప్రభుత్వం కేసులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ సూచనలతో కేసులను రద్దు చేస్తున్నట్లు హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఆర్ఎం కిషోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో నమోదైన కేసులను రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఉద్యమంలో నమోదైన కేసులన్నింటిని ఎత్తివేస్తామని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

ఎన్నికల ప్రచారం ఇచ్చిన హామీకి తగ్గట్టుగా వైయస్ జగన్ ప్రభుత్వం కేసులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ సూచనలతో కేసులను రద్దు చేస్తున్నట్లు హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఆర్ఎం కిషోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇకపోతే సెప్టెంబర్ 4న జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. ఏపీకి ప్రత్యేకహెదా అవసరం అనే ఉద్ధేశ్యంతో పోరాటం చేసిన యువకులపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేసులు పెట్టిందని, అలా యువతీ యువకులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నట్లు జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ప్రత్యేక హెదా మాత్రమే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదని నమ్మి ఎందరో యువతీ, యువకులు పోరాటం చేశారని వారిపై పెట్టిన కేసులను ఎత్తి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే గడిచిన ఐదేళ్లలో ఉద్యమాన్ని అణచివేసేందుకు టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని, ఆ కేసులను ఎత్తివేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. 

2014 నుంచి 2019వరకు పోరాటం చేయగా వాళ్లపై పెట్టిన క్రిమినల్ కేసులు ఎత్తివేస్తున్నట్లు జగన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం ఉద్యమించిన అందరి కేసులు ఎత్తివేయాలని కేబినెట్ భేటీలో జగన్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితను ఆదేశించారు. 

హోదా ఉద్యమంలో కేసులను ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయం పది రోజులు గడవక ముందే వాటిని ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. 
 

click me!