ఏపీలో కీలక పదవులు కోల్పోయిన తొమ్మిది మంది టీడీపీ నేతలు

By Nagaraju penumalaFirst Published Jun 3, 2019, 7:03 PM IST
Highlights

మే 29 తర్వాత చంద్రబాబు నాయుడు రాజీనామా తో రాష్ట్రంలో మంత్రి మండలి, ప్రభుత్వ విప్ ల వ్యవస్థ రద్దు అయిందని తెలిపారు. దీంతో చట్టసభల్లో తొమ్మిదిమంది ప్రభుత్వ విప్ పదవులను కోల్పోయారు. అటు శాసన మండలిలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ లు విప్ పదవులను కోల్పోయారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన సభ, శాసన మండలిలో ప్రభుత్వ విప్, చీఫ్ విప్ హోదాలను రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. చట్టసభల్లో చీఫ్ విప్, విప్ హోదాలను రద్దు చేస్తూ ఆయన జీవో జారీ చేశారు. 

మే 29 తర్వాత చంద్రబాబు నాయుడు రాజీనామా తో రాష్ట్రంలో మంత్రి మండలి, ప్రభుత్వ విప్ ల వ్యవస్థ రద్దు అయిందని తెలిపారు. దీంతో చట్టసభల్లో తొమ్మిదిమంది ప్రభుత్వ విప్ పదవులను కోల్పోయారు. 

అటు శాసన మండలిలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ లు విప్ పదవులను కోల్పోయారు. త్వరలో ప్రభుత్వ విప్ , ప్రభుత్వ చీఫ్ విప్ పదవులను వైయస్ జగన్ ప్రభుత్వం ఎంపిక చేయనుంది. 

click me!