తొలి ఎమ్మెల్సీ ప్రకటించిన సీఎం వైయస్ జగన్

By Nagaraju penumalaFirst Published Jun 3, 2019, 6:46 PM IST
Highlights

ప్రస్తుతం తన పక్కన ఎమ్మెల్యేలుగా గెలిచిన నలుగురు తన పక్కన ఉన్నారని త్వరలోనే ఇక్బాల్ అన్న కూడా ఉంటారని తెలిపారు. ముస్లిం సోదరులు ఐదుగురు చట్టసభల్లో ఉండాలన్నది తన లక్ష్యమని అందువల్ల త్వరలోనే ఇక్బాల్ అన్నకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక్బాల్ ను చట్ట సభలో కూర్చోబెడతానని హామీ ఇచ్చారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో మెుదటి ఎమ్మెల్సీ స్థానాన్ని ప్రకటించారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. గుంటూరులో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైయస్ జగన్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ ఎన్నికల్లో తాను ఐదుగురు ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చానని అయితే వారిలో నలుగురు గెలిచారని ఒకరు ఓడిపోయారని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి పోటీ చేసిన ఇక్బాల్ ఓటమి చెందారని గుర్తు చేశారు. 

ప్రస్తుతం తన పక్కన ఎమ్మెల్యేలుగా గెలిచిన నలుగురు తన పక్కన ఉన్నారని త్వరలోనే ఇక్బాల్ అన్న కూడా ఉంటారని తెలిపారు. ముస్లిం సోదరులు ఐదుగురు చట్టసభల్లో ఉండాలన్నది తన లక్ష్యమని అందువల్ల త్వరలోనే ఇక్బాల్ అన్నకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక్బాల్ ను చట్ట సభలో కూర్చోబెడతానని హామీ ఇచ్చారు.

గతంలో తన తండ్రి దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలన చూశారని తన పాలన కూడా చూడాలన్నారు. తన తండ్రి పాలన కంటే గొప్ప పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వాన్ని, రాష్ట్రం బాగుండాలని, జగన్ మంచి పాలన అందించాలని దేవుడిని ప్రార్థించాలని ముస్లిం సోదరులకు వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు. 
 
click me!