ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 9 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 534కు చేరుకుంది. ఇప్పటి వరకు ఏపీలో 14 కరోనా మరణాలు సంభవించాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 534కు చేరుకుంది. కొత్తగా కృష్ణా, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో మూడేసి కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొంది 20 మంది డిశ్చార్జీ అయ్యారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 122 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 మంది మరణించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలలో 4గురు చొప్పున, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఇద్దరు చొప్పున చనిపోయారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకు ఏ విధమైన కేసులు నమోదు కాలేదు.
జిల్లాలవారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది....
అనంతపురం 21 చిత్తూరు 23 తూర్పు గోదావరి 17 గుంటూరు 122 కడప 36 కృష్ణా 45 కర్నూలు 110 నెల్లూరు 58 ప్రకాశం 42 విశాఖపట్నం 20