‘‘తెలంగాణలో పొత్తు ఏపీకి సంబంధం లేదు.. టీటీడీపీదే తుది నిర్ణయం’’

By sivanagaprasad KodatiFirst Published 9, Sep 2018, 3:45 PM IST
Highlights

తెలంగాణలో కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుతో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప

తెలంగాణలో కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుతో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. ఇవాళ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డిని, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి అనంతపురం వచ్చిన చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నికల పొత్తు గురించి టీటీడీపీ నేతలే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

టీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి అక్కడి నేతలు స్ధానిక పరిస్థితులను బట్టి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తెలంగాణ పొత్తు గురించి తామిక్కడ మాట్లాడలేమని... తమ అధినేత చంద్రబాబుదే ఈ విషయంలో తుది నిర్ణయమన్నారు. ఏపీలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని చినరాజప్ప స్పష్టం చేశారు.

జగన్ తప్పు చేశారు కాబట్టే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని.. నాడు వైస్ హయాంలో చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టినా ఒక్కటీ నిలబడలేదన్నారు. జేసీ దివాకర్‌రెడ్డికి ఇంకా కాంగ్రెస్ వాసన పోలేదని.. అందువల్లే అధికార పార్టీలో ఉంటూనే పోలీస్ వ్యవస్థ మీద ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

Last Updated 9, Sep 2018, 3:45 PM IST