ఎంతటి పెద్దవారైనా సరే: పెద్దిరెడ్డికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కౌంటర్

Published : Feb 06, 2021, 04:34 PM ISTUpdated : Feb 06, 2021, 04:47 PM IST
ఎంతటి పెద్దవారైనా సరే: పెద్దిరెడ్డికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కౌంటర్

సారాంశం

పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఎంతటి పెద్దవారు బెదిరించినా భయపడవద్దని ఆయన ఉద్యోగులకు సూచించారు.

అమరావతి: పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలక మిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎంతటి పెద్దవారు బెదిరించినా ఉద్యోగులు భయపడవద్దని ఆయన అన్నారు. 

ఎన్నికల విధుల్లో అధికారులపై తన అనుమతి లేకుండా చర్యలు తీసుకునే అధికారం ఎవరికీ లేదని ఆయన స్ఫష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, రిటర్నింగ్ అధికారులు అభద్రతకు లోను కావద్దని ఆయన సూచించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు ఎన్నికల కమిషన్ రక్షణ కవచంలా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేసాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తుందని చెప్పారు. 

ప్రభుత్వ ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు అనైతికమని ాయన అన్నారు. ఉద్యోగుల పట్ల దుందుడుకు చర్యలకు పాల్పడేవారిని ఏ మాత్రం ఉపేక్షించబోమని హెచ్చిరంాచరు. వ్యక్తులు ఎవరైనా తాత్కాలికమేనని, వ్యవస్థలు మాత్రమే శాశ్వతమని ఆయన అన్నారు. 

పోలింగ్ సమయాన్ని పెంచుతూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కారణంగా ఎన్నికల సమయాన్ని పెంచుతున్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. పోలింగ్ ఉదయం ఆరున్నర గంటల నుంచి సాయంత్రం మూడున్నర గంటల వరకు జరుగుతుందని ఆయన చెప్పారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఒంటి గంటన్నర వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు.

ఇదిలావుంటే, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై ఆంక్షలు విధిస్తూ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని భావించింది. రేపు, ఎల్లుండి హైకోర్టుకు సెలవులు కావడంతో హోస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎపీఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికి మాత్రమే పరిమితం చేయాలని, ఆయన బయటకు రాకుండా చూడాలని నిమ్మగడ్డ డిజిపీకి ఆదేశాలు చేసిన విషయం తెలిసిందే. డీజీపీకి, ఎస్పీకి ఆయన ఆ ఆదేశాలు జారీ చేశారు. 

ఈ నెల 21వ తేదీ వరకు పెద్దిరెడ్డిపై ఆంక్షలను అమలు చేయాలని ఆయన చెప్పారు. మీడియాతో కూడా మాట్లాడేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనుమతించకూడదని ఆయన అన్నారు. ఎన్నికలు నిర్భయంగా జరిపించడానికే ఈ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. 

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేయడంపై పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించాలని, ఏకగ్రీవాలను ప్రకటించకపోతే ఆ అధికారులపై చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను అమలు చేయకూడదని ఆయన రిటర్నింగ్ అధికారులకు సూచించారు  నిమ్మగడ్డ ఆదేశాలను పాటించే అధికారులను బ్లాక్ లిస్టులో పెడుతామని ఆయన హెచ్చరించారు. 

దానిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్రంగా ప్రతిస్పందించారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడిన విషయాలు ప్రచురితమైన పత్రికల కట్టింగ్స్ ను కూడా నిమ్మగడ్డ తన లేఖకు జత చేశారు. ఎన్నికలు సజావుగా జరగడానికే పెద్దిరెడ్డిపై ఆంక్షలు పెడుతున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Gudivada Amarnath Pressmeet: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్‌ పంచ్ లు| Asianet News Telugu