కరోనా ఎఫెక్ట్: నెల్లూరు సిటీలో రాత్రిపూట కర్ఫ్యూ విధింపు

By narsimha lodeFirst Published Aug 5, 2021, 4:36 PM IST
Highlights


నెల్లూరులో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు గాను రాత్రి 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను విధించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా  నెల్లూరు కమిషనర్ దినేష్ కుమార్ చెప్పారు. 


నెల్లూరు: నెల్లూరులో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గాను సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయాలని నెల్లూరు  కమిషనర్  దినేష్ కుమార్ నిర్ణయించారు.కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నందున కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నామని కలెక్టర్ ప్రకటించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు 4.5 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటును కనీసం 2 నుండి 2.5 శాతానికి తగ్గిస్తే నైట్ కర్ఫ్యూను ఎత్తివేస్తామని కమిషనర్ చెప్పారు.

నెల్లూరులో ప్రతి వందమందిలో నలుగురు నుండి ఐదుగురికి కరోనా పాజిటివ్ కేసులు నమోదౌతున్నాయి. సాయంత్రం పూటే దుకాణాలను మూసివేయాలని వాణిజ్య సంఘాల ప్రతినిధులను కమిషనర్ కోరారు. దీనికి వ్యాపారస్తులు కూడ ముందుకొచ్చారు.కరోనా కేసుల తీవ్రత పెరిగితే థర్డ్‌వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏపీ రాష్ట్రంలో కరోనా కేసుల తగ్గుదల కోసం  ప్రభుత్వం వ్యాక్సినేషన్ తో పాటు  అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడ కేంద్రం కూడ అన్ని రాష్ట్రాలకు సూచించింది.

click me!