బాబు ప్రభుత్వం సహాయ నిరాకరణ: జగన్ పై దాడి కేసుపై కోర్టుకు ఎన్ఐఎ

By pratap reddyFirst Published Jan 8, 2019, 3:42 PM IST
Highlights

జగన్ మీద జరిగిన దాడి కేసును విజయవాడ కోర్టుకు బదలాయించాలని కూడా ఎన్ఐఎ కోరింది. నిందితుడు శ్రీనివాసరావును కూడా కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కోర్టును ఆశ్రయించింది.  జగన్ మీద జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇప్పించాలని ఎన్‌ఐఏ కోర్టులో మెమో దాఖలు చేసింది. 

జగన్ మీద జరిగిన దాడి కేసును విజయవాడ కోర్టుకు బదలాయించాలని కూడా ఎన్ఐఎ కోరింది. నిందితుడు శ్రీనివాసరావును కూడా కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

విశాఖ విమానాశ్రయంలో నిరుడు అక్టోబర్‌ 25న జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు  దర్యాప్తును హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్‌ఐఎకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎన్‌ఐఎ జనవరి 1న ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించింది. విచారణలో భాగంగా ఏపీ పోలీసులు సహకరించకపోవడంతో ఎన్‌ఐఏ అధికారులు కోర్టును ఆశ్రయించారు.

click me!