పెళ్లైన మూడు నెలలకే ఓ వరుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అతనిది ప్రేమ పెళ్లి కావడం గమనార్హం. ఈ ఘటన చిత్తూరులో వెలుగు చూసింది.
చిత్తూరు : ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి అయిన మూడు నెలలకే బలవన్మరణానికి పాల్పడడంతో విషాదం అలుముకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. చిత్తూరు జిల్లా వీకోట మండలం కంభర్లపల్లి గ్రామనివాసి మారప్పగారి రంజిత్ కుమార్ (24).
గుంటూరు జిల్లా తెనాలిలో తన మేనత్త వద్ద ఉంటూ ఓ బట్టల దుకాణంలో పనిచేసేవాడు.10వ తరగతి వరకు చదువుకున్నాడు. అక్కడే, హర్షప్రియ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. పెద్దలను ఒప్పించి మార్చి 8వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత యనమలకుదురులో ఇద్దరు కాపురం పెట్టారు. వీరితోపాటు అత్త వీర వెంకట నాగలక్ష్మి సుధారాణి కూడా వీరితోనే ఉంటుంది. రంజిత్ కుమార్ జూన్ 6వ తేదీ రాత్రి పది గంటల సమయంలో తండ్రి మంజునాథ తో ఫోన్లో మాట్లాడాడు. ఆ తరువాత కాసేపటికి భోజనం చేసిన తర్వాత మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పాడు,
బెడ్రూంలో నా భర్తతో మాట్లాడుతుంటే పోలీసులు.. పొంచి ఉండి విన్నారు..
కానీ తండ్రికి ఏ ఫోను చేయలేదు.. రాత్రి 11 సమయంలో రంజిత్ కుమార్ అత్త వీర వెంకట నాగలక్ష్మి సుధారాణి.. రంజిత్ కుమార్ సోదరుడు మహేష్ కుమార్ కు ఫోన్ చేసింది.. ఇంట్లోనే పడకగదిలో రంజిత్ కుమార్ ఉరేసుకొని చనిపోయినట్లుగా వివరించింది. అది గమనించి స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే రంజిత్ కుమార్ చనిపోయి ఉన్నట్లుగా తెలిపింది.
బుధవారం ఉదయం రంజిత్ కుమార్ తండ్రి ఇతర కుటుంబ సభ్యులు యనమలకుదురు చేరుకున్నారు. కొడుకు మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చెప్పిన వివరాలను బట్టి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతని మృతికి వ్యక్తిగత సమస్యలు లేదా కుటుంబ వివాదాలు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.