బదిలీలు .. ఉద్యోగ సంఘాలకు షాకిచ్చిన జగన్ సర్కార్ , ఆ లేఖలు నిలుపుదల

Siva Kodati |  
Published : Jun 07, 2023, 09:18 PM IST
బదిలీలు .. ఉద్యోగ సంఘాలకు షాకిచ్చిన జగన్ సర్కార్ , ఆ లేఖలు నిలుపుదల

సారాంశం

ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు జగన్ సర్కార్ షాకిచ్చింది. బదిలీల్లో మనిహాయింపులు కోరుతూ జారీ చేసే ఆఫీస్ బేరర్ల లేఖలను నిలుపుదల చేయాలని ఆదేశించింది. 

ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. సాధారణ బదిలీల్లో మనిహాయింపులు కోరుతూ జారీ చేసే ఆఫీస్ బేరర్ల లేఖలను నిలుపుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, సర్వీసెస్ అసోసియేషన్ల లేఖలను పరిగణనలోనికి తీసుకోవద్దని సూచించింది. సిఫారసు లేఖల్లో నకిలీలు వుంటాయన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లోనూ నకిలీ లేఖలు వస్తున్నాయని సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ) పేర్కొంది. అలాగే ఆఫీస్ బేరర్లుగా లేఖలు ఇచ్చిన ఉద్యోగుల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఆఫీస్ బేరర్ల సిఫారసు లేఖలను స్క్రూట్నీ చేయాలని ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే మ్యాటర్.. దసరా హాలిడేస్ తర్వాత కూడా మరో నాల్రోజులు సెలవులే!
AP Municipal Elections 2026 : టీడీపీ మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు వీళ్లే...