ఏపీ మంత్రి, వైసీపీ నేత రోజా నుంచి తమకు ప్రాణహానీ వుందంటూ ఓ ప్రేమజంట చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మంత్రి నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు పోలీసులను ఆశ్రయించారు. తమకు ఏదైనా జరిగితే దానికి మంత్రి రోజాదే బాధ్యత అని అన్నారు.
ఏపీ మంత్రి, వైసీపీ నేత రోజా నుంచి తమకు ప్రాణహానీ వుందంటూ ఓ ప్రేమజంట చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మంత్రి నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన ప్రవీణ, నెల్లూరుకు చెందిన జిలానీలు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరి మతాలు వేరు కావడంతో ప్రవీణ తల్లిదండ్రులు వీరి ప్రేమ వివాహానికి అంగీకరించలేదు.
అంతేకాదు.. ప్రవీణకు వేరే సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. దీనిని గమనించి ఆమె ఇంటి నుంచి పారిపోయి.. జిలానీని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అయితే తమకు మంత్రి రోజా నుంచి ప్రాణహానీ వుందని.. పోలీసులు తమకు రక్షణ కల్పించడకుండా ఆమె ఒత్తిడి చేస్తున్నారని ప్రేమజంట ఆరోపిస్తోంది. తమకు ఏదైనా జరిగితే దానికి మంత్రి రోజాదే బాధ్యత అని అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.