న్యూ ఇయర్ 2024 : కొత్త సంవత్సరం ఏపీలో భారీగా సెలవులు.. ఎన్నిరోజులో చూడండి..

Published : Dec 13, 2023, 08:11 AM IST
న్యూ ఇయర్ 2024 :  కొత్త సంవత్సరం ఏపీలో భారీగా సెలవులు.. ఎన్నిరోజులో చూడండి..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో 2024లో బోలెడు సెలవులు రానున్నాయి. సంవత్సరారంభమైన జనవరిలోనే 11నుంచి 13 సెలవులు ఉన్నాయి. 

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఈసారి సంక్రాంతికి నాలుగు నుంచి ఆరు రోజుల సెలవులు రానున్నాయి. ఆంధ్రులకు సంక్రాంతి పండగ అత్యంత ముఖ్యమైనది. సాధారణంగా ఈ పండుగకు రెండు, మూడు రోజులు సెలవులు ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం సంక్రాంతికి నాలుగు,  ఆరు రోజులు సెలవులు ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్త సంవత్సరం 2024కి సెలవుల క్యాలెండర్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 

ఈ సెలవులు అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తాయి. ముందుగా జనవరిలో 13వ తేదీ సెకండ్ సాటర్ డే, జనవరి 14 ఆదివారంనాడు భోగి,  జనవరి 15 సంక్రాంతి.. ఇవన్నీ సాధారణ సెలవులే. ఆ తర్వాత జనవరి 16వ తేదీన ఆప్షనల్ హాలిడే పెట్టుకోవచ్చు. ఇవి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తిస్తాయి. అయితే స్కూల్స్, కాలేజీల్లాంటి విద్యాసంస్థలకు మరో రెండు రోజులపాటు అదనంగా సెలవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి : వైఎస్సార్సీపీలో 40మంది సిట్టింగులకు నో ఛాన్స్...

దీంతో మొత్తం వరుసగా ఆరు రోజుల పాటు సెలవులు వస్తాయి. జనవరి నెలలో 4 ఆదివారాలు ఉన్నాయి. దీనికి తేడు రెండో శనివారం, నాలుగో శనివారం.. కలిపి మొత్తంగా ఎక్కువగానే సెలవులు వస్తున్నాయి. ఒక్క  2024 జనవరి నెలలోనే  దాదాపు 11 నుంచి 13 రోజులపాటు సెలవులు వస్తున్నాయి.

కొత్త సంవత్సరంలో.. ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయంటే….

నెం.నెల, తేదీవారంపండుగ
1.జనవరి 15సోమవారంసంక్రాంతి
2.జనవరి 16మంగళవారంకనుమ
3.జనవరి 26 శుక్రవారంరిపబ్లిక్ డే
4.మార్చి 8 శుక్రవారంమహాశివరాత్రి
5.మార్చ్ 25సోమవారంహోలీ
6.మార్చి 29        శుక్రవారంగుడ్ ఫ్రైడే
7.ఏప్రిల్ 5శుక్రవారంబాబు జగ్జీవన్ రామ్ జయంతి
8.ఏప్రిల్ 9మంగళవారంఉగాది
9.ఏప్రిల్ 11 గురువారంఈద్-ఉల్-ఫితర్
10.ఏప్రిల్ 17బుధవారంశ్రీరామనవమి 
11.జూన్ 17సోమవారంబక్రీద్
12జులై 17బుధవారంమొహర్రం
13ఆగస్టు 15గురువారంస్వాతంత్ర దినోత్సవం
14ఆగస్టు 26సోమవారంశ్రీ కృష్ణాష్టమి
15సెప్టెంబర్ 7శనివారంవినాయక చవితి
16సెప్టెంబర్ 16సోమవారంఈద్ మిలాన్ ఉన్ నబీ
17అక్టోబర్ 2బుధవారంగాంధీ జయంతి
18అక్టోబర్ 11శుక్రవారందుర్గాష్టమి
19అక్టోబర్ 31గురువారందీపావళి
20డిసెంబర్ 25                    బుధవారంక్రిస్మస్ 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Gudivada Amarnath Pressmeet: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్‌ పంచ్ లు| Asianet News Telugu