జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో ట్విస్ట్: సుపారీ ఎవరిచ్చారో తేల్చేపనిలో సిట్

By Nagaraju penumalaFirst Published Oct 13, 2019, 10:36 AM IST
Highlights

సునీల్ గ్యాంగ్ కు మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య మర్డర్ డీల్ శ్రీనివాస్ రెడ్డి చేసినట్లు సిట్ బృందం తేల్చింది. అయితే శ్రీనివాసరావు ఇటీవలే అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే శ్రీనివాస్ రెడ్డికి సుపారీ ఎవరు ఇచ్చారో అన్న కోణంలో సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. 

కడప: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వివేకానందరెడ్డి హత్య కేసు సుపారీ హత్యగా సిట్ బృందం తేల్చేసింది. అందుకు సంబంధించి కీలక ఆధారాలను సైతం సేకరించినట్లు తెలుస్తోంది. 

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ మాజీమంత్రి వైఎస్ వివేకాను హత్య చేసినట్టు సిట్ బృందం తేల్చింది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిట్ బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపింది. 

సుమారు 800 మందిని విచారించింది. విచారణలో సునీల్ గ్యాంగ్ హత్య చేసినట్లు నిర్ధారించింది. వైయస్ వివేకా హత్యకు సంబంధించి నిందితులు వాడిన బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. బైక్ ఆధారంగా కేసులో కీలక సాక్ష్యం లభ్యమైనట్లు తెలుస్తోంది. 

click me!