నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం చల్లాయపాలెం, పల్లిపాలెంకు చెందిన వెంకటేష్ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వచ్చిన డబ్బంతా మందుకే తగలేసేవాడు. గత ఏడేళ్లుగా మద్యానికి బానిసైన వెంకటేష్.. మద్యం సేవించి చిందులు తొక్కేవాడు. సంపాదించిన డబ్బంతా మద్యానికే ఖర్చుపెట్టడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవాడు.
కాస్త టైం దొరికిందా.. ఇద్దరు ఫ్రెండ్స్ కలిశారా.. ఏదైనా అకేషన్ వచ్చిందా.. అంతే.. సిట్టింగ్ వేయాల్సిందే. బాటిల్స్ ఖాళీ చేయాల్సిందే... ఇది ఇప్పటి యూత్ లో బాగా కనిపిస్తున్న ట్రెండ్. మందు తాగనివాడిని గాడిదకంటే హీనంగా చూడడం కూడా ఇందులో భాగమే.. అయితే నెల్లూరుకు చెందిన ఓ యువకుడు ఏడేళ్లుగా ఉన్న మందు అలవాటును..ఎడమకాలితో తన్నేసి.. దేవుడి మీద ప్రమాణం చేసి మరీ తాగనని ప్రతిన బూనాడు.. అదేంటో చూడండి...
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం చల్లాయపాలెం, పల్లిపాలెంకు చెందిన వెంకటేష్ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వచ్చిన డబ్బంతా మందుకే తగలేసేవాడు. గత ఏడేళ్లుగా మద్యానికి బానిసైన వెంకటేష్.. మద్యం సేవించి చిందులు తొక్కేవాడు. సంపాదించిన డబ్బంతా మద్యానికే ఖర్చుపెట్టడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవాడు.
undefined
మందు మానేయమని ఎంతమంది చెప్పినా అతని చెవికెక్కలేదు. మత్తు జీవితాన్ని చిత్తు చేస్తుంటే.. ఎలా కలిగిందో ఏమో సడెన్ గా జ్ఞానోదయం కలిగింది. మందు మానేయాలన్న ఆలోచన వచ్చింది. అలాగని గప్ చిప్ గా మందు మానేసి ఊరుకుంటూ ఎలా అనుకున్నాడేమో...మేళతాళాలతో ఊరంతా తిరుగుతూ హంగామా చేశాడు.
గుడికి వెళ్లాడు. పూజారులు వెంకటేశు బాగుండాలని పూజలు చేశారు. ఆ తరువాత .. ఊరివాళ్లందరి ముందు, దేవుని సాక్షిగా.. ఇన మీదట మందు ముట్టనని ప్రమాణం చేశాడు. వెంకటేష్ చేసిన ఈ హంగామాతో.. పల్లెపాలెంలోనే కాదు.. చుట్టు పక్కల ప్రాంతాల్లో ఒక్కసారిగా వెంకటేష్ హైలెట్ అయిపోయాడు.
‘మందు తాగితే వచ్చే కిక్ తో ఏం ప్రయోజనం లేదు.. ఏడేళ్లుగా ఆ అలవాటు వల్ల ఎంతో నష్టపోయాను.. ఫ్రెండ్స్ మీరూ.. మారండి.. దురలవాట్లు మానేయండి...’ అంటూ వెంకటేశ్ ఇప్పుడు అందరికీ చెబుతుండడం విశేషం.