మీ సంకల్పం చాలా గొప్పది..: లేఖ ద్వారా ప్రధానిపై ప్రశంసలు కురిపించిన జగన్

By Arun Kumar PFirst Published Jun 8, 2021, 9:55 AM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన సుస్థిర అభివృద్ధికి దోహదం చేస్తుందని జగన్ పేర్కొన్నారు.  

అమరావతి: దేశ ప్రధాని నరేంద్ర మోదీపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశంసల వర్షం కురింపించారు. కేంద్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన సుస్థిర అభివృద్ధికి దోహదం చేస్తుందని జగన్ పేర్కొన్నారు.  

అందరికీ ఇళ్లను అందించాలన్న ఆలోచనతో కేంద్రం ముందుకు వెళుతుండటాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. వచ్చే ఏడాది 2022నాటికి పీఎంఏవై కింద పేదలందరికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న ప్రధాని సంకల్పం చాలా గొప్పదని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. 

read more  థర్డ్ వేవ్ హెచ్చరిక... చిన్నారుల కోసం మూడు భారీ హాస్పిటల్స్... జగన్ సర్కార్ నిర్ణయం

ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలకు ప్రధానికి తెలియజేశారు జగన్. ఏపీ ప్రభుత్వం 68,381ఎకరాల భూమిని పేదలకు పంచిందని... 17,005 గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో 30.76లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 28.35లక్షల పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని జగన్ పేర్కొన్నారు. ఇదుకోసం రూ.50,944 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. 

 పీఎంఏవై పథకం కింద ఇళ్ల నిర్మాణం అయితే చేపట్టాం.... కానీ మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు అవసరం అవుతాయన్నారు సీఎం. 34,104కోట్ల నిధులు కేవలం మౌలిక వసతుల కోసమే అవసరం అవుతాయి. ఇక ఇప్పటికే ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కోసం 23,535 కోట్లు చేశామని పేర్కొన్నారు. ఇలా భారీమొత్తంలో నిధులను ఇళ్ల నిర్మాణం కోసం ఖర్చుచేస్తున్నాం... కాబట్టి మౌలిక వసతుల కోసం రాష్ట్రానికి నిధులు కేటాయించి అండగా నిలవాలి అని మోదీని జగన్ కోరారు. 

click me!