ఆనందయ్య మందుపై విమర్శలు: సోమిరెడ్డిపై కేసు నమోదు

Published : Jun 06, 2021, 11:00 AM IST
ఆనందయ్య మందుపై విమర్శలు: సోమిరెడ్డిపై కేసు నమోదు

సారాంశం

మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.

నెల్లూరు:మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదకుమార్ ఫిర్యాు మేరకు చీటింగ్, ఫోర్జరీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.నెల్లూరు:ఆనందయ్య మందును ఆన్‌లైన్ లో పంపిణీ చేయడం కోసం ప్రభుత్వం తయారు చేసిన వెబ్‌సైట్ పై  మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఆయన విమర్శలు గుప్పించారు. 

also read:రేపటి నుండే ఆనందయ్య మందు పంపిణీ: కృష్ణపట్టణంలో 144 సెక్షన్

చిల్‌డీల్.కామ్ వెబ్‌సైట్‌ను  గో డాడీ సంస్థ నుండి శేశ్రిత టెక్నాలజీ సంస్థ కొనుగోలు చేసిందని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ వెబ్‌పైట్ ద్వారా ఆనందయ్య మందును  విక్రయించి సొమ్ము చేసుకోవాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై శేశ్రిత సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా సోమిరెడ్డిపై కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్