ప్రభుత్వాసుపత్రిలో చిన్నారి కిడ్నాప్: మహిళ అరెస్ట్

Published : Jun 05, 2019, 05:17 PM IST
ప్రభుత్వాసుపత్రిలో చిన్నారి కిడ్నాప్: మహిళ అరెస్ట్

సారాంశం

నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు. చిన్నారిని తల్లి ఒడికి చేర్చారు.నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో కోట మండలానికి చెందిన మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ అనారోగ్యానికి గురికావడంతో ఐసీయూలో ఉంచారు.  


నెల్లూరు: నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు. చిన్నారిని తల్లి ఒడికి చేర్చారు.నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో కోట మండలానికి చెందిన మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ అనారోగ్యానికి గురికావడంతో ఐసీయూలో ఉంచారు.

అయితే ఈ విషయాన్ని గుర్తించిన కోవూరుకు చెందిన ఓ మహిళ ఐసీయూలోకి వెళ్లి తన బిడ్డగా చెప్పుకొని ఆ బిడ్డను తీసుకెళ్లింది. అయితే బిడ్డ కోసం వచ్చిన లక్ష్మీ కుటుంబీకులు విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయాన్ని చిన్నారి తల్లి లక్ష్మికి చెప్పకుండానే పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. 8 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.ఆసుపత్రిలోని సీసీటీవీపుటేజీ ఆధారంగా  కోవూరుకు చెందిన మహిళ చిన్నారిని కిడ్నాప్‌ చేసిందని పోలీసులు గుర్తించారు. 

ఆ మహిళ నుండి చిన్నారిని బుధవారం నాడు సాయంత్రం  కిడ్నాపర్ నుండి తీసుకొచ్చి లక్ష్మీ దంపతులకు అప్పగించారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.


 

PREV
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu