12 కిలోల బంగారంతో ఉడాయించేందుకు నకిలీ ఐటీ అదికారుల స్కెచ్: పట్టుకున్న నెల్లూరు పోలీసులు

By narsimha lode  |  First Published Aug 26, 2022, 5:31 PM IST

నెల్లూరులో నకిలీ  ఐటీ బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బంగారం దుకాణం నుండి 12 కిలోల బంగారంతో నకిలీ ఐటీ అధికారుల బృందం తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.


నెల్లూరు:నెల్లూరు పట్టణంలో నకిలీ ఐటీ అధికారులు శుక్రవారం నాడు హల్ చల్ చేశారు. జ్యుయలరీ దుకాణంలో  12 కిలోల బంగారంతో ఉడాయించేందుకు ప్రయత్నించడంతో వ్యాపారస్తులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు.

నెల్లూరు పట్టణంలో ఏడుగురు వ్యక్తులు కాకర్ల వీధిలోని పలు దుకాణాల్లో నకిలీ ఐటీ అధికారులు హల్ చల్ చేశారు. పలు దుకాణాల్లో ఐటీ అధికారుల తనిఖీలు చేశారు. చివరకు ఓ బంగారం దుకాణంలోకి వెళ్లారు. ఈ దుకాణం తలుపులు వేశారు. దుకాణ యజమాని బంగారం క్రయ విక్రయాలకు సంబంధించిన లెక్కలు చూపినా కూడా పట్టించుకోలేదు.

Latest Videos

undefined

ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారని  సమాచారం అందుకున్న జ్యుయలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా అక్కడకు చేరుకున్నారు. తనిఖీలు సాగుతున్న దుకాణంలోకి జ్యుయలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని కూడా అనుమతించలేదు. చివరకు ఆయన దుకాణంలోకి ప్రవేశించారు.

అయితే అప్పటికే ఐటీ అధికారులుగా చెప్పుకున్న ముఠా సభ్యులు దుకాణంలోని 12 కిలోల బంగారాన్ని మూట గట్టుకుని కారులో ఎక్కారు.ఈ విషయాన్ని గమనించిన ఇతర దుకాణ యజమానులు కూడా అనుమానించి కారును చుట్టుముట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల రంగ ప్రవేశంతో నకిలీ ఐటీ అధికారుల వ్యవహరం బయటకు వచ్చింది. పోలీసులు నకిలీ ఐటీ అధికారుల ముఠాను అరెస్ట్ చేశారు. నకిలీ ఐటీ అధికారుల వద్ద ఓ తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

click me!