నారాయణ కాలేజీ బిల్డింగ్ మీదినుండి జారిపడ్డ విద్యార్థి.. నడుము, కాళ్లు విరిగి...

By AN TeluguFirst Published Jan 1, 2021, 10:08 AM IST
Highlights

నారాయణ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో ఓ విద్యార్థి నడుము, కాళ్లు విరిగాయి. కాలేజీ బిల్డింగ్ మీదినుండి జారి పడి ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. కర్నూలు జిల్లా, నన్నూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. 

నందికొట్కూరు మండలం కోళ్ల బావాపురం గ్రామానికి చెందిన మద్దిలేటి యాదవ్‌ కుమారుడు సురేంద్రయాదవ్‌ (17) నన్నూరు సమీపంలోని నన్నూరు నారాయణ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ (ఎంపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాడు.

 మూడు రోజుల కిందట హాస్టల్‌కు వెళ్లాడు. అక్కడ చదువుల ఒత్తిడితో మనస్తాపానికి గురయ్యాడు.గురువారం తెల్లవారుజామున నిద్రమత్తులో హాస్టల్‌ భవనంపైకి వెళ్లిన అతడు గ్రిల్‌ లేకపోవడంతో కాలుజారి కిందపడ్డాడు. 

దీంతో రెండుకాళ్లు, నడుము ఎముకలు విరిగాయి. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్‌ ఇన్‌చార్జికి సమాచారం ఇచ్చారు. బాధితుడిని చికిత్స నిమిత్తం కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 

కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. కళాశాల యాజమాన్యం గ్రిల్‌ ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

click me!