అసెంబ్లీలో వైఎస్ జగన్ కునుకు: ఈ మనిషికి అంటూ నారా లోకేష్ ట్వీట్

Published : Jan 20, 2020, 04:40 PM ISTUpdated : Jan 20, 2020, 06:46 PM IST
అసెంబ్లీలో వైఎస్ జగన్ కునుకు: ఈ మనిషికి అంటూ నారా లోకేష్ ట్వీట్

సారాంశం

అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుపై వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కునుకు తీస్తున్న దృశ్యాన్ని నారా లోకేష్ ట్విట్టర్ లో పోస్టు చేశాడు. ఈ మనిషి ఇలా ఎలా నిద్రపడుతోందంటూ వ్యాఖ్యానించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కీలకమైన మూడు రాజధానుల బిల్లు మీద వేడివాడిగా చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కునుకు తీశారు. అ కునుకు తీస్తున్న జగన్ ఫొటోను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

ఓ పక్క రాజధాని మార్పుపై అధికార పక్షం తన వాదనలను బలంగా వినిపిస్తుంటే, మరో వైపు అమరావతి రైతులు సచివాలయాన్ని నాలుగు వైపుల నుంచి ముట్టడించారు. ఈ స్థితిలో అక్కడ ఉద్రిక్తర వాతావరణ చోటు చేసుకుంది. 

ఆ పరిస్థితిపై నారా లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. మూడు రాజధానుల బిల్లుపై చర్చ జరుగుతుండగా అసెంబ్లీలో వైఎస్ జగన్ కునుకు తీశారంటూ టీవీ చానెల్ లో వచ్చిన ఓ ఫొటోను ఆయన పోస్టు చేశారు. 

"ఓ పక్క రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు రోడ్డెక్కి అసెంబ్లీని ముట్టడిస్తుంటే మరో పక్క రాష్ట్రం మొత్తం టీవీలు చూస్తుటే ఈ మనిషికి ఇలా ఎలా నిద్రపడుతోంది" అంటూ ఆయన ట్వీట్ చేశారు. నారా లోకేష్ ట్వీట్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది 

 

PREV
click me!

Recommended Stories

అంబటి అరెస్టు రాజకీయ కక్షసాధింపే | Baireddy Siddharth Reddy Slams Alliance | Asianet News Telugu
Holiday : ఈ సోమవారం కూడా తెలుగోళ్లకు సెలవే... ఎందుకో తెలుసా..?