ఏపిలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు...ఇక వారికి దిక్కేది: లోకేశ్ సంచలనం

By Arun Kumar PFirst Published Jun 2, 2020, 6:18 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం అణగారిన దళిత సామాజికవర్గాన్ని మరింత అణచివేసేలా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. 

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం అణగారిన దళిత సామాజికవర్గాన్ని మరింత అణచివేసేలా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. గతకొంత ఆ సామాజిక వర్గంపై జరుగుతున్న దాడులే అందుకు నిదర్శనమన్నారు. ఏపిలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందంటూ సంచలన విమర్శలు చేశారు.

''ఆంధ్ర యూనివర్సిటీలో కుల వివక్ష దారుణం.దళిత ఆచార్యుడు డాక్టర్ పేటేటి ప్రేమానందం గారి పై కులం పేరుతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.ఏయూ లో ప్రేమానందం గారిని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలి'' అంటూ  ట్విట్టర్ వేదికన లోకేశ్ డిమాండ్ చేశారు.

read more   నిమ్మగడ్డ కోసం డజన్ల మంది లాయర్లు.. ఎందుకంత హైరానా: బాబుపై విజయసాయి వ్యాఖ్యలు

''అణ‌గారిన వ‌ర్గాల హ‌క్కుల‌కు దిక్కుగా నిలిచిన డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ గారి రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కి జగన్ రెడ్డి త‌న తాత రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు చేస్తున్నారు. వైకాపా నేతల దౌర్జ‌న్యాలు, అణిచివేత‌ల‌తో ద‌ళితులు ద‌గా ప‌డ్డారు'' అని మండిపడ్డారు.  

''కచ్చులూరు బోటు ప్రమాదానికి కారణమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు మాజీ ఎంపీ హర్షకుమార్ గారి పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసారు. ద‌ళితుల‌కు జ‌రుగుతున్న  అన్యాయాల‌పై ప్ర‌‌శ్నించినందుకు మహాసేన రాజేష్ గారి పై రౌడీషీట్ ఓపెన్ చేశారు'' అని ఆరోపించారు. 

''మాస్కుల్లేవ‌ని అడిగిన ద‌ళిత డాక్ట‌ర్ సుధాక‌ర్‌ని ఉగ్ర‌వాది కంటే ఘోరంగా హింసించి బంధించారు.ద‌ళితుల‌కు ఉపాధి క‌ల్పించే లిడ్‌క్యాప్ భూములు లాగేసుకున్నారు. ద‌ళితుల గొంతును నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్న నిరంకుశ జ‌గ‌న్  ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌పై తిరుగుబాటు త‌ప్ప‌దు'' అని  లోకేశ్ హెచ్చరించారు. 

click me!