Nara Lokesh: నేడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో నారా లోకేశ్ శంఖారావం... పూర్తి షెడ్యూల్ ఇదిగో!

Published : Feb 14, 2024, 04:49 AM IST
Nara Lokesh: నేడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో నారా లోకేశ్ శంఖారావం... పూర్తి షెడ్యూల్ ఇదిగో!

సారాంశం

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయం హీటెక్కుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. తాజాగా టీడీపీ నేత నారా లోకేశ్ శంఖారావం యాత్ర ప్రారంభించారు.    

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయం హీటెక్కుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, గెలుపుపై ద్రుష్టి సారించాయి. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు రా.. కదలిరా పేరిట బహిరంగ సభలు నిర్వహించి.. విస్తృతంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నారా లోకేష్ కూడా ప్రచార రంగంలోకి దిగారు. ఇటీవలే యువగళం పాదయాత్ర పూర్తి చేసిన ఆయన యువగళం పాదయాత్రలో కవర్ చేయని ప్రాంతాల్లో శంఖారావం పేరుతో మరో యాత్ర చేపట్టారు. అందులో భాగంగా నారా లోకేశ్ ఫిబ్రవరి 11 నుంచి శ్రీకాకుళం జిల్లాలో  శంఖారావం యాత్ర ప్రారంభించారు.

 ఈ తరుణంలో లోకేశ్‌ చేపట్టిన శంఖారావం యాత్ర జిల్లాలో మూడో రోజు మంగళవారం విజయవంతమైంది. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో శంఖారావం బహిరంగ సభ నిర్వహించగా టీడీపీ కేడర్‌తో పాటు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నేతలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలను అందించారు.ఈ సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ.. మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది జగన్ రెడ్డి అని పేర్కొన్నారు. జాబ్ కేలండర్ కాస్తా సాక్షి కేలండర్ లా మారింది. 

డీఎస్సీ మోసం, బీసీ ఫీజు రీయింబర్స్ మెంట్, విదేశీ విద్య, 6500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి ఏడాది భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు  డీఎస్సీ అంటూ మోసం చేస్తున్నారని, 800 గ్రూప్ -2 పోస్టులకు 5 లక్షల మంది రాశారన్నారు. ఇలా తక్కువ పోస్టులు భర్తీ చేస్తు మేమేం ఉద్యోగాలు వేస్తున్నామంటూ ప్రజలకు జగన్ రెడ్డి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలు ఓపికపడితే టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని, ఏటా జాబ్ కేలండర్ ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు లేక రాష్ట్రంలో పెద్దఎత్తున నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే.. నాలుగవ రోజు యాత్ర భాగంగా  నేడు (బుధవారం) ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి సభల్లో పాల్గొంటారు.ఈ యాత్ర పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం సాలూరు నియోజకవర్గంలో, సాయంత్రం బొబ్బిలి నియోజకవర్గంలో సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో శంఖారావం సభల్లో పాల్గొంటారు.

14-2-2024 (బుధవారం) కార్యక్రమ షెడ్యూల్ ఇదిగో.. 

శంఖారావం కార్యక్రమ షెడ్యూల్ 

ఉమ్మడి విజయనగరం జిల్లా

పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం

ఉదయం
10.00 – యాత్ర ప్రారంభం ..

10.15 – అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కిడారి శ్రావణ్ కుమార్, జనసేన అధ్యక్షురాలు లోకం నాగ మాధవి ప్రసంగం.
10.25 – మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
10.35– పార్వతీపురం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఏ.మోహన్ రావు, బోనెల విజయ్ చంద్ర ప్రసంగం.
10.50– పార్వతీపురం శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
11.26– పార్టీ కేడర్ కు  'బాబు సూపర్ - 6' కిట్ల అందజేత.
11.30– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ  లోకేశ్.
11.40 – పార్టీకేడర్ తో లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
12.45 – నారా లోకేశ్ సాలూరు చేరిక, భోజన విరామం. 

సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం
మధ్యాహ్నం
2.15  – కిడారి శ్రావణ్ కుమార్, లోకం నాగ మాధవి ప్రసంగం.
2.25 – మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
2.30– సాలూరు జనసేన సమన్వయకర్త జి.రిషివర్థన్ , టీడీపీ ఇంఛార్జ్ గుమ్మడి సంధ్యారాణి ప్రసంగం.
2.40– సాలూరు శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.
3.00– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
3.30– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ .
 4.00 – నారా లోకేశ్ బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిక.

బొబ్బిలి నియోజకవర్గం
సాయంత్రం
4.45 – టీపీడీ కిమిడి నాగార్జున, జనసేన లోకం నాగ మాధవి ప్రసంగం.
4.55 – టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
5.10 – బొబ్బిలి శంఖారావంలో నారా లోకేశ్ ప్రసంగం.
5.30 – పార్టీ కార్యకర్తలతో లోకేశ్ ముఖాముఖి.
6.00 – టీడీపీ కార్యకర్తలచే లోకేశ్ ప్రతిజ్ఞ.
6.00 – రోడ్డుమార్గం ద్వారా రాజాం ప్రయాణం.
6.40 – రాజాంలో బస  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?